
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-నేపాల్ మధ్య తల్తెతిన అన్ని అంశాలను చర్చల ద్వారా పరిష్కరిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నేపాల్‌తో సామాజిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలే కాకుండా ఆథ్యాత్మిక సంబంధాలను భారత్ పంచుకుంటుందని అన్నారు. ఉత్తరాఖండ్ జన్ సంవాద్ ర్యాలీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పాల్గొంటూ కైలాష్ మానససరోవర్ యాత్ర కోసం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) లిపులేక్ వరకూ లింక్ రోడ్డు నిర్మించడంతో పొరుగు దేశంతో విభేదాలు నెలకొన్నాయని అన్నారు. గతంలో నాథులా పాస్ ద్వారా యాత్రికులు మానససరోవర్‌కు వెళ్లేవారని, భారత భూభాగంలో 80 కిమీ పొడవైన రోడ్డు నిర్మాణంతో మానససరోవర్‌కు కొత్త రహదారి అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఈ రహదారిపై నేపాల్‌లో సరైన అవగాహన కొరవడిందని, చర్చల ద్వారా ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరిస్తామని రాజ్‌నాథ్ వెల్లడించారు. కాగా కాలాపాని, లిపూలేక్, లింపియదుర వంటి భారత భూభాగాలను తమ మ్యాప్‌లో చూపుతూ రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ దిగువసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment