రేపిస్టు ఎమ్మెల్యే సభ్యత్వాలు పోయాయి
షిల్లాంగ్: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ ఎమ్మెల్యే జులియస్ కే దోర్పాంగ్ అసెంబ్లీకి సంబంధించిన కమిటీల్లో సభ్యత్వం పోయింది. రెండు కీలక కమిటీల్లో ఆయనకు ఉన్న సభ్వత్వాన్ని తొలగించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ కమిటీల్లో సభ్యుడిగా నియమించిన నెల రోజుల్లోనే ఆయనను తిరిగి పక్కకు తప్పించారు. ఈ మేరకు మేఘాలయ స్పీకర్ అబు తాహర్‌మోందాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
దోర్పాంగ్‌కు సభ్యత్వం ఉన్న కమిటీలను తిరిగి మారుస్తున్నామని తెలిపారు. ప్రివిలేజెస్, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీల్లో దోర్పాంగ్‌కు సభ్యత్వం ఉంది. పద్నాలుగేళ్ల అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడినట్లు దోర్పాంగ్‌పై ఎఫ్‌ఐఆర్ ఉంది. ఈ ఏడాది జనవరిలోనే ఆయనను అరెస్టు చేశారు. అయితే, లైంగిక దాడికి పాల్పడిన ఓ ఎమ్మెల్యేకు గౌరవ ప్రదమైన కమిటీల్లో చోటు ఎలా ఇస్తారంటూ మహిళా విభాగం నుంచి ఆగ్రహం పెల్లుబికిన నేపథ్యంలో ఆయనను తొలగించారు.