![Grandfather Arrested For Raping 7 Year Old Child In Meghalaya - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/19/minor.jpg.webp?itok=gZk57hkr)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, షిల్లాంగ్ : తప్పొప్పులపై నలుగురికీ చెప్పాల్సిన తాత పశువాంఛతో సొంత మనవరాలిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. మేఘాలయాలోని నార్త్ గరో హిల్స్‌కు సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో 60 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలిక స్వయానా మనవరాలిపై ఘాతుకానికి తెగబడ్డాడు. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై లైంగిక దాడులపై ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈనెల 10న బాధిత బాలిక ట్యూషన్‌కు వెళ్లేందుకు పుస్తకాలు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో డెనీ మారక్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని, జరిగిన విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడని అధికారులు వెల్లడించారు.
అయితే బాలిక ఇటీవల వేధింపుల గురించి తల్లికి చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు మారక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించామని, దర్యాప్తు కొనసాగుతోందని నార్త్ గరో హిల్స్ ఎస్‌పీ డాల్డన్ తెలిపారు. గతంలో రెండు సందర్భాల్లోనూ బాధిత బాలికను నిందితుడు లైంగికంగా వేధించాడని తెలిసిందని చెప్పారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment