పెట్రోలు పోసే మెషీన్ నూ లాగేసుకు వెళ్లిన కారు
పెట్రోలు పోసే మెషీన్ నూ లాగేసుకు వెళ్లిన కారు
Published Sat, Jul 12 2014 7:54 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
ఢిల్లీలోని వసంతకుంజ్ లో ఓ కారు పెట్రోల్ బంక్ లో పెట్రోలు నింపుకుని వెళ్తున్న ఓ కారు పొరబాటుగా పెట్రోల్ పోసే పైప్ ను కూడా లాగేయడంతో మొత్తం పెట్రోల్ పోసే మెషీన్ కూడా ఊడి వచ్చేసింది. దీంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన శనివారం జరిగింది.
దీంతో పెట్రోల్ మొత్తం బంక్ అంతా పాకి ఉన్నట్టుండి భగ్గుమంది. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి గాయపడ్డాడు. మిగిలిన వారు మాత్రం ఎలాంటి ప్రమాదమూ లేకుండా బయటపడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో మంటలు విస్తరించలేదు. ఒక వేళ పెట్రోలు నిలువ ఉంచే ట్యాంకు వరకూ మంటలు వ్యాపించి ఉంటే ఎన్నో ప్రాణాలు ఆవిరైపోయి ఉండేవి.
నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తి తాలూకు చిత్రాలు, కారు నంబరు బంకులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని సిబ్బంది చెప్పారు. ఇప్పుడు పోలీసులు ఆ కారు యజమాని కోసం వెతుకుతున్నారు.
Advertisement
Advertisement