ఆమ్ ఆద్మీకి రెమో ఫెర్నాండేజ్ గుడ్ బై!
ప్రఖ్యాత పాప్ సింగర్ రెమో ఫెర్నాండేజ్ క్రీయాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. భారత రాజకీయాల్లో అరవింద్ కేజ్రివాల్ క్రేజ్, ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అయితే ఇష్టమైన సంగీతాన్ని వదలుకొని రాజకీయాల్లోకి వచ్చిన రెమో లాభం లేదునుకున్నారో.. సరిపడదని అనుకున్నారో ఏమో అర్ధాంతరంగా నిష్క్రమించడం గోవా ఆప్ కు షాకినిచ్చింది.
దక్షిణ గోవా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెమో పోటి చేయనున్నారనే వార్తలు గోవాలో ప్రధానంగా వినిపించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం కోసం పనాజీలోని ప్రధాన వ్యాపార కూడలిలోని స్వంత భవనాన్ని ఉచితంగా కేటాయించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కోసం వంద శాతం తన సమయాన్ని కేటాయిస్తాను. నా ఆలోచనలకు దగ్గరగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండా ఉంది. కేజ్రివాల్ ఆశయాలు, పార్టీ లక్ష్యాలు, సిద్దాంతాలు చాలా ఇష్టం. రాజకీయాల్ల వల్ల తనకు ఇష్టమైన మ్యూజిక్ రంగాన్ని వదులుకోవాల్సి వస్తోంది అని రెమో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
క్రియాశీలక రాజకీయాల్లోకి తప్పుకోవాలనే నిర్ణయం ఆప్ కు కొంత నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'ఆప్' పార్టీ ఆవిర్భావం నుంచి గోవాలో అన్నితానై వ్యవహరించిన రెమో.. అర్ధాంతరంగా తప్పుకోవడ వెనుక పార్టీలో లుకలుకలే కారణమని కొందరు భావిస్తున్నారు.