Remo Fernandes
-
పాప్ సింగర్ కు అండగా నిలిచిన 'ఆప్'
పనాజీ: న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రముఖ పాప్ గాయకుడు రెమో ఫెర్నాండెజ్(62)కు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గోవా విభాగం అండగా నిలిచింది. 17 ఏళ్ల బాలికను దూషించారని రెమో ఫెర్నాండెజ్ పై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. తన కొడుకుపై ఫిర్యాదు చేసిన ఓ బాలికను బెదిరించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 'తెలిసో, తెలియకో రెమో ఫెర్నాండెజ్ చట్టాన్ని ఉల్లంఘించారు. ఫలితంగా ఎదురైన పరిణామాలను ధైరంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు. ఇదంతా జరిగినప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నారు. ఒకవైపు వాదన మాత్రమే బయటకు వచ్చింది. ఆయన వాదన కూడా మనం వినాల్సివుంద'ని ఆప్ గోవా కన్వీనర్ వాల్మికీ నాయర్ అన్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆప్ ప్రచారం కోసం పాట రాసిన రెమో ఫెర్నాండెజ్ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆప్ ఆయనను దూరం చేసుకోలేదని, తనకు తానుగా పార్టీకి దూరంగా ఉంటున్నారని నాయక్ వెల్లడించారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం రెమో ఫెర్నాండెజ్ పెట్టుకున్న పిటిషన్ పై వాదనలను గోవా బాలల కోర్టు మంళవారం ఆలకించనుంది. -
బాలికను బెదిరించి రెమో బుక్కయ్యాడు
పనాజి: 'అది అరబిక్ కడలందం' అంటూ తెలుగు సినీ సంగీత ప్రియులకు పరిచయమైన ప్రఖ్యాత పాప్ గాయకుడు రెమో ఫెర్నాండెజ్ (62) పై గోవాలో కేసు నమోదైంది. తన కొడుకుపై ఫిర్యాదు చేసిన ఓ బాలికను బెదిరించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని కేసును ఉపహంహరించుకోవాలని రెమో బెదిరించాడని, భయపెట్టి, దుర్భాషలాడాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి జివ్బా దాల్వి తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం రెమోకు అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నామని తెలిపారు. డిశెంబర్ 2వ తేదీన రెమో కొడుకు జోనాద్ నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి ఓ బాలికను గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె గోవాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమయ్యాడంటూ జోనాద్ పై మపుసా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ప్రమాదం జరిగిన మరునాడు రెమో ఆ అమ్మాయిని బెదిరించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ప్రస్తుతం యూరోప్ ట్రిప్ లో ఉన్న రెమో ఈ ఆరోపణలను ఖండించాడు. వాస్తవాలను పక్కదోవ పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అతడు మండిపడ్డాడు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం కేసు దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నాడు. -
మే 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: రెమో ఫెర్నాండెజ్ (గాయకుడు), చలపతిరావు (నటుడు) ఈరోజు పుట్టిన రోజు జరుపుకునేవారి మాట ఈ సంవత్సరమంతా తిరుగులేని రీతిలో చలామణి అవుతుంది. వీరి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 3 కావడం వల్ల వీరికి లలితకళలు, సంగీతం, సాహిత్యం వంటివాటిపై అభిరుచి, ఆసక్తి పెరుగుతాయి. ఈ రంగాలలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇది గురు గ్రహానికి సంబంధించిన అంకె కావడం వల్ల సైన్స్, వైద్యరంగాలలో ఉన్న వారికి అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే వీరు ఎంత శ్రమ చేస్తే అంత మంచి ఫలితం కనిపిస్తుంది. లక్కీ నంబర్స్: 1,3,5,6,8. లక్కీ కలర్స్: బ్లూ, క్రీమ్, శాండల్, లెమన్ ఎల్లో. అనాథలకు అన్నదానం, దక్షిణామూర్తి ఆరాధన వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. - రహిమాన్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఆమ్ ఆద్మీకి రెమో ఫెర్నాండేజ్ గుడ్ బై!
ప్రఖ్యాత పాప్ సింగర్ రెమో ఫెర్నాండేజ్ క్రీయాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. భారత రాజకీయాల్లో అరవింద్ కేజ్రివాల్ క్రేజ్, ఆశయాలను స్పూర్తిగా తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అయితే ఇష్టమైన సంగీతాన్ని వదలుకొని రాజకీయాల్లోకి వచ్చిన రెమో లాభం లేదునుకున్నారో.. సరిపడదని అనుకున్నారో ఏమో అర్ధాంతరంగా నిష్క్రమించడం గోవా ఆప్ కు షాకినిచ్చింది. దక్షిణ గోవా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెమో పోటి చేయనున్నారనే వార్తలు గోవాలో ప్రధానంగా వినిపించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం కోసం పనాజీలోని ప్రధాన వ్యాపార కూడలిలోని స్వంత భవనాన్ని ఉచితంగా కేటాయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం వంద శాతం తన సమయాన్ని కేటాయిస్తాను. నా ఆలోచనలకు దగ్గరగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండా ఉంది. కేజ్రివాల్ ఆశయాలు, పార్టీ లక్ష్యాలు, సిద్దాంతాలు చాలా ఇష్టం. రాజకీయాల్ల వల్ల తనకు ఇష్టమైన మ్యూజిక్ రంగాన్ని వదులుకోవాల్సి వస్తోంది అని రెమో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. క్రియాశీలక రాజకీయాల్లోకి తప్పుకోవాలనే నిర్ణయం ఆప్ కు కొంత నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'ఆప్' పార్టీ ఆవిర్భావం నుంచి గోవాలో అన్నితానై వ్యవహరించిన రెమో.. అర్ధాంతరంగా తప్పుకోవడ వెనుక పార్టీలో లుకలుకలే కారణమని కొందరు భావిస్తున్నారు.