పాప్ సింగర్ కు అండగా నిలిచిన 'ఆప్'
పనాజీ: న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రముఖ పాప్ గాయకుడు రెమో ఫెర్నాండెజ్(62)కు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గోవా విభాగం అండగా నిలిచింది. 17 ఏళ్ల బాలికను దూషించారని రెమో ఫెర్నాండెజ్ పై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. తన కొడుకుపై ఫిర్యాదు చేసిన ఓ బాలికను బెదిరించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
'తెలిసో, తెలియకో రెమో ఫెర్నాండెజ్ చట్టాన్ని ఉల్లంఘించారు. ఫలితంగా ఎదురైన పరిణామాలను ధైరంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డారు. ఇదంతా జరిగినప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నారు. ఒకవైపు వాదన మాత్రమే బయటకు వచ్చింది. ఆయన వాదన కూడా మనం వినాల్సివుంద'ని ఆప్ గోవా కన్వీనర్ వాల్మికీ నాయర్ అన్నారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో ఆప్ ప్రచారం కోసం పాట రాసిన రెమో ఫెర్నాండెజ్ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆప్ ఆయనను దూరం చేసుకోలేదని, తనకు తానుగా పార్టీకి దూరంగా ఉంటున్నారని నాయక్ వెల్లడించారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం రెమో ఫెర్నాండెజ్ పెట్టుకున్న పిటిషన్ పై వాదనలను గోవా బాలల కోర్టు మంళవారం ఆలకించనుంది.