
సాక్షి, చెన్నై: ఆర్కేనగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ నెల 21న జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. అధికార అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే(శశికళ వర్గం) అభ్యర్థి దినకరన్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. చెన్నై థౌజండ్ లైట్స్‌లోని క్వీన్ మేరిస్ కళాశాలలో ఐదంచెల భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ప్రక్రియ వెబ్ టెలికాస్టింగ్, వీడియో చిత్రీకరణకు ఎన్నికల యంత్రాంగం అన్ని చర్యలు తీసుకొంటోంది. ఈ ఎన్నికలో దినకరన్‌దే గెలుపని, మధుసూదనన్, గణేషన్‌లు వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తారని కావేరి టీవీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. దినకరన్‌కు సుమారు 37 శాతం ఓట్లు దక్కొచ్చని పేర్కొంది.