కూటమిగా ఏర్పడ్డ ఆర్జేడీ, జేడీ(యూ) | RJD, JD(U) decide to contest Bihar polls together | Sakshi
Sakshi News home page

కూటమిగా ఏర్పడ్డ ఆర్జేడీ, జేడీ(యూ)

Published Sun, Jun 7 2015 6:10 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

కూటమిగా ఏర్పడ్డ ఆర్జేడీ, జేడీ(యూ) - Sakshi

కూటమిగా ఏర్పడ్డ ఆర్జేడీ, జేడీ(యూ)

న్యూఢిల్లీ:  త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, అధికార పార్టీ జేడీ(యూ)లు కలిసి పోటీచేయనున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ రెండు గంటల పాటు చర్చించి ఈ నిర్ణయాన్ని వెల్లడించారని సమాజ్ వాదీ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సమక్షంలో నితీష్, లాలు ప్రసాద్ సమావేశమయ్యారని తెలుస్తోంది.

6 మంది సభ్యులు ఉండే ప్యానల్ ఆయా పార్టీలకు సీట్ల కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటుందని, ప్యానల్ సభ్యుల పేర్లను వెల్లడించేందుకు రామ్ గోపాల్ నిరాకరించారు. ఆర్జేడీ, జేడీ(యూ) రెండు పార్టీల నుంచి ముగ్గురు చొప్పున సభ్యులు ఈ ప్యానల్లో ఉంటారని ఆయన తెలపారు. సీఎం అభ్యర్ధి విషయాన్ని మీడియా ఆయన వద్ద ప్రస్తావించగా ఈ విషయంలో ఎటువంటి వివాదాలు లేవని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement