ములాయం 'మూడో' పల్లవి | SP, NCP, SJD-D to contest Bihar polls as Third Front | Sakshi
Sakshi News home page

ములాయం 'మూడో' పల్లవి

Published Thu, Sep 17 2015 6:24 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

ములాయం 'మూడో' పల్లవి - Sakshi

ములాయం 'మూడో' పల్లవి

లక్నో: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి టాటా చెప్పిన సమాజ్ వాది పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ 'మూడో' పల్లవి అందుకున్నారు. థర్ట్ ఫ్రంట్ తో కలిసి పోటీకి సై అంటున్నారు. సమాజ్ వాదీ జనతాదళ్ డెమొక్రటిక్(ఎస్ జేడీ-డీ), ఎన్సీపీ, నేషనల్స్ పీపుల్స్ పార్టీ(ఎన్ పీపీ) కూటమితో సమాజ్ వాదీ పార్టీ జతకట్టింది.

బిహార్ ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, ఎస్ జేడీ-డీ అధ్యక్షుడు దేవేంద్ర ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని మూడో ఫ్రంట్ కలిసి తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తొలి విడతలో 49 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి సెప్టెంబర్ 23తో గడువు ముగుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement