సుబ్రతా రాయ్
ఢిల్లీ: సహారా గ్రూప్ కేసును సుప్రీం కోర్టు ఏప్రిల్ 9వ తేది వరకూ వాయిదా వేసింది. అప్పటివరకూ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు తీహార్ జైల్లోనే ఉంటారు. వీరు ముగ్గురూ మార్చి 4 నుంచి జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే పది వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది.
ఇప్పటికిప్పుడు 10 వేల కోట్ల రూపాయలు చెల్లించలేమని సహారా గ్రూప్ సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసింది.తాము తక్షణమే 2.500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించగలమని కోర్టుకు తెలిపారు. మూడు వారాల తర్వాత మరో 2.500 కోట్ల రూపాయలు చెల్లిస్తామని సహారా గ్రూప్ విన్నవించింది. దాంతో ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.