Sahara case
-
127 ట్రక్కుల్లో 3 కోట్ల పత్రాలు.. సెబీకి పంపిన సుబ్రతా రాయ్.. కారణం ఇదేనా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణం దాదాపు మూడు కోట్ల మంది పెట్టుబడిదారులు చేసిన మదుపుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సహారా ఇండియా గ్రూప్ సంస్థ వెబ్సైట్ ప్రకారం.. ఈ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులు ఉన్నారు. రూ.2.59 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వేల క్యాంపస్‌లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్లు సహారా ఇండియా వెబ్సైట్ చెబుతోంది. సెబీ చర్యల కారణంగా సుబ్రతా రాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం పతనం అవడం మొదలైంది. సహారా సంస్థ రియల్ఎస్టేట్ పెట్టుబడుల కోసమంటూ మూడు కోట్ల మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.25వేల కోట్ల రూపాయలను సమీకరించడంపై కేసు నమోదైంది. 2011లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) అనే రెండు సంస్థలను సెబీ ఆదేశించింది. అందుకు సంబంధించిన వివరాలు అడిగిన నేపథ్యంలో సహారా గ్రూప్ నుంచి 127 ట్రక్కులను సెబీ కార్యాలయానికి పంపి సుబ్రతా రాయ్ వార్తల్లో నిలిచారు. ఆ ట్రక్కుల్లో మూడు కోట్ల దరఖాస్తు పత్రాలు, రెండు కోట్ల రిడంప్షన్ ఓచర్లు ఉన్నాయి. నిర్ణత గడువులోగా రూ.10 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే 2014 మార్చి 4న సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. రూ.5 వేల కోట్లు నగదు రూపంలో, మిగతా రూ.5 వేల కోట్లు బ్యాంకు గ్యారంటీ రూపంలో హామీ ఇస్తేనే ఆయన విడుదల సాధ్యమవుతుందని కోర్టు స్పష్టం చేసింది. రాయ్ రెండేళ్ల జైలు జీవితం అనంతరం పెరోల్‌పై విడుదలయ్యారు. ఇదీ చదవండి: ‘ఎక్స్’ సమాచారాన్ని నమ్మలేం.. జిమ్మీ వేల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు సెబీకు దాదాపు రూ.25వేల కోట్లు డిపాజిట్ చేసినట్లు గతంలో సుబ్రతారాయ్ ప్రకటించారు. కానీ కంపెనీ పెట్టుబడిదారులకు సెబీ తిరిగి సొమ్ము చెల్లించలేదని రాయ్ ఆరోపించారు. సెబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 మార్చి 31 నాటికి పెట్టుబడిదారులకు ఇచ్చేందుకు మొత్తం రూ.25,163 కోట్లు నిర్ణయించినప్పటికీ రూ.138 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించింది. రెండు సహారా గ్రూపు సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు సేకరించేటప్పుడు వివిధ నిబంధనలను ఉల్లంఘించారు. మార్చి 31 నాటికి తమకు 20వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 17500 దరఖాస్తులకు సంబంధించిన డబ్బును వాపసు చేశామని సెబీ తెలిపింది. సరైన రుజువులు సమర్పించని కారణంగా మిగతావాటిని చెల్లించలేదని వివరించింది. సెబీ లేవనెత్తిన ప్రశ్నలపై బాండ్ హోల్డర్ల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో వాటిని నిలిపేసినట్లు సమాచారం. -
సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు
న్యూఢిల్లీ: సహారా గ్రూపునకు చెందిన నాలుగు కోపరేటివ్ (హౌసింగ్) సొసైటీల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 9 నెలల్లోగా చెల్లింపులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెబీ వద్ద ఎస్క్రో ఖాతాలో సహారా గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.24,000 కోట్ల నిధుల నుంచి రూ.5,000 కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్స్కు బదిలీ చేయాలంటూ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. (ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్) ఓ ప్రజాహిత వ్యాజ్యం విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జి ఆర్ సుభాష్ రెడ్డి చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. పెద్ద ఎత్తున ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉండడంతో పిటిషనర్ల అభ్యర్థన సహేతుకంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిందని కోపరేషన్ శాఖ ప్రకటన విడుదల చేసింది. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) -
సహారా ఇన్వెస్టర్లకు చెల్లించింది రూ.129 కోట్లు
న్యూఢిల్లీ: నిధులున్నాయి. కానీ, వీటి తాలూకూ ఇన్వెస్టర్లే కనిపించడం లేదు..! సహారా కేసు వ్యవహారంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి ఇది. సహారా గ్రూపు కంపెనీలకు సంబంధించిన కేసులో ఇన్వెస్టర్లకు సెబీ ఇప్పటి వరకు కేవలం రూ.129 కోట్లే చెల్లించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖాతాలో సహారా గ్రూపునకు సంబంధించి నిధులు రూ.23,191 కోట్లు ఉండడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలతో చెల్లింపుల బాధ్యతను సెబీ చూస్తున్న విషయం తెలిసిందే. రెండు సహారా గ్రూపు కంపెనీల బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారిలో అత్యధికుల నుంచి క్లెయిమ్‌లు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రెండు కంపెనీలకు సంబంధించి 3 కోట్ల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయాలని సుప్రీంకోర్టు 2012 ఆగస్ట్‌లోనే ఆదేశించింది. సెబీ తాజా వార్షిక నివేదికను పరిశీలిస్తే.. 2021 మార్చి 31 నాటికి ఇన్వెస్టర్ల నుంచి 19,616 దరఖాస్తులే వచ్చాయి. ఇందులో 16,909 దరఖాస్తులను పరిష్కరించింది. రూ.129 కోట్లను చెల్లించింది. చిరునామాల్లో తేడాలున్నాయంటూ 483 దరఖాస్తులను వెనక్కి పంపింది. 332 దరఖాస్తులు సహారా వద్ద అపరిష్కృతంగా ఉన్నాయి. -
10 రోజులే అవకాశం, లేదంటే జైలుకే
సహారా అధినేత సుబ్రతారాయ్ కు సుప్రీంకోర్టు మరో 10 రోజులు అవకాశమిచ్చింది. ఆయనకు ముందు ఇచ్చిన జూన్ 19 వరకు పెరోల్ గడువును జూలై 5 వరకు పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. అంతకముందు ఇచ్చిన గడువులో జూన్ 15 వరకు రూ.1500 కోట్లను చెల్లించాలని లేకపోతే, ఏకంగా తిహార్ జైలుకే పంపుతామని గట్టిగా హెచ్చరించింది. కానీ వాటిలో సహారా రూ.790 కోట్లను మాత్రమే చెల్లించింది. మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు పెరోల్ పొడిగింపును కోరింది. లండన్ లోని గ్రోస్వెనోర్ హౌస్ స్టేక్ ను అమ్మామని, దీని ద్వారా మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి చెల్లించాల్సిన నగదును సేకరిస్తున్నామని సహారా సుప్రీంకోర్టుకు చెప్పింది. మిగతా రూ.709.82 కోట్ల మొత్తాన్ని కూడా సహారా-సెబీకి 10 రోజుల్లో రీఫండ్ చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో జైలుకు పంపాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించింది. మొత్తంగా ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ.25,781 కోట్ల మొత్తంలో ఇంకా సహారా రూ.11,169 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇన్వెస్టర్స్ నుంచి వేల కోట్ల రూపాయలను వసూలు చేసిన ఘటనలో దోషిగా ఉన్న సుబ్రతోరాయ్ ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నాడు. ఈ విషయంపై సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కు వ్యతిరేకంగానూ, వాటి ప్రమోటర్ సుబ్రతారాయ్, ముగ్గురు డైరెక్టర్లపై 2012లో సెబీ కేసు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో విచారణలో నడుస్తోంది. సహారా ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన మొత్తం కోసం కోర్టు వేలం ప్రక్రియను కూడా చేపడుతోంది. -
సహారా కేసులో కొత్త ట్విస్ట్
రాయ్ బెయిల్ నిధుల విషయంలో సంబంధంలేదన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ బెయిల్‌కు సంబంధించి రూ.10,000 కోట్ల సమీకరణ అంశం కీలకమైన మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఎదుట సహారా గ్రూప్ స్వయంగా తన బ్యాంకరుగా పేర్కొన్న బ్యాంకింగ్ సంస్థే హఠాత్తుగా తనకు సహారా డీల్‌తో ఏ సంబంధంలేదంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే- సహారా గ్రూప్ సుప్రీంకోర్టుకు దాదాపు నెల రోజుల క్రితం ఒక నోట్ సమర్పిస్తూ, అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్ గ్రూప్ 2 బిలియన్ డాలర్ల ఫైనాన్షింగ్ ప్యాకేజ్ని ఆఫర్ చేసినట్లు తెలిపింది. దీనిని అమెరికా కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఈ మేరకు మిరాచ్ తమకు కొన్ని డాక్యుమెంట్లను ఇప్పటికే అందించినట్లు సహారా గ్రూప్ కోర్టుకు తెలిపింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం డీల్‌కు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఏ) బ్యాంకర్‌గా వ్యవహరిస్తున్నట్లు కూడా సహారా గ్రూప్ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తాజా విషయం ఏమిటంటే... ఈ డీల్‌లో తమకు ఎటువంటి పాత్రా లేదని బీఓఏ ప్రతినిధి ఒకరు ఖండిస్తూ ప్రకటన చేశారు. మిరాచ్ కేపిటల్‌కు భారత సంతతికి చెందిన సరాంచ్ శర్మ సీఈఓగా పనిచేస్తున్నారు. తాజా బీఓఏ ప్రకటనతో ఈ డీల్ మొత్తం వ్యవహారంపై నీలిమేఘాలు కమ్ముకున్నట్లయ్యింది. కోర్టు డాక్యుమెంట్లలో తమ పేరును పేర్కొన్నట్లు తెలుసుకున్న బీఓఏ, ఈ విషయంలో ఏవైనా ఫోర్జరీలు జరిగాయా అన్న కోణంలో తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చిన వార్తల ప్రకారం డీల్‌కు సంబంధించి ఫిబ్రవరి 20వ తేదీ లోపు సహారా, మిరాచ్ల మధ్య ఒప్పందం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే తాజా పరిణామంతో ఈ వ్యవహారం మొత్తం సందేహాస్పదమైపోయింది. 2014 మార్చి నుంచీ సహారా చీఫ్ సుబ్రతారాయ్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. రెండు గ్రూప్ సంస్థలు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.25,000 కోట్లు వసూలు చేశాయన్నది ఆరోపణ. అయితే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో సహారా వైఫల్యం... మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోర్టు ధిక్కారణ పిటిషన్ దీనికి నేపథ్యం. మోసపోయాం: సహారా మరోవైపు తాజాగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామంపై సహారా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. అమెరికా సంస్థ మిరాచ్ కేపిటల్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ విషయంలో నిధులు రెడీగా ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంటున్నట్లుగా సృష్టించిన ఒక ఫోర్జరీ లేఖను ఆ సంస్థ తమకు అందించిందని ఆరోపించింది. అననుకూల వాతావరణంలో తాను ఈ విషయంలో ఘోరంగా మోసపోయినట్లు పేర్కొంది. దేశంలోనూ, అమెరికాలోనూ మిరాచ్ కేపిటల్, ఆ సంస్థ అధికారులపై సివిల్, క్రిమినల్సహా, తగిన చట్టపరమైన చర్యలు అన్నీ తీసుకోనున్నట్లు ప్రకటించింది. మిరాచ్ కేపిటల్ గ్రూప్ ప్రవర్తనను ఘోరమైనదిగా తప్పుపడుతూ తీవ్ర పదజాలంతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ మోసపూరిత వ్యవహారంలో మిరాచ్ కేపిటల్ గ్రూప్‌కు చెందిన భారత, అమెరికా అధికారులు అందరూ భాగస్వాములేనని విమర్శించింది. ఈ డీల్‌కు సంబంధించి కలతచెందే సమాచారం ఫిబ్రవరి 1న తమకు తెలిసిందని కూడా పేర్కొంది. దీనితో బ్యాంక్ ఆఫ్ అమెరికా లేఖపై నిజనిర్థారణకు తాము స్వయంగా ప్రయత్నం చేయడం ప్రారంభించామని వివరించింది. చివరకు మిరాచ్ తమను మోసం చేసిందని గుర్తించామని తెలిపింది. దీనిని తాము తేలిగ్గా తీసుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సహారా చేసిన ఈ ఆరోపణలపై మిరాచ్ కేపిటల్‌పై స్పందన ఇంకా తెలియరాలేదు. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి నుంచి వచ్చిన ప్రకటన తరువాతే, సహారా దీనిపై స్పందించడం ఇక్కడ గమనార్హం. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రకటన వెలువడిన వెంటనే మిరాచ్ కేపిటల్‌పై సీఈఓ శర్మను మీడియా సంప్రదించింది. బీఓఏ ప్రకటనపై ఆయన ప్రత్యక్షంగా ఏదీ వివరణ ఇవ్వలేదు. ఈ లావాదేవీని తెగతెంపులు చేసుకోవడంలేదన్నారు.. -
19న సహారా కేసుపై కొత్త బెంచ్ విచారణ
న్యూఢిల్లీ: సహారా కేసు విచారణకు సుప్రీం కోర్టు కొత్త బెంచ్ ఏర్పాటు అయ్యింది. జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రిలు సభ్యులుగా ఉండే ఈ బెంచ్ వచ్చే సోమవారం (మే 19) విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తులు జె.ఎస్. కేహార్, కె.ఎస్. రాధాకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం 2012 నుంచి సహారా కేసును విచారించింది. అయితే, ఈ నెల 14న రాధాకృష్ణన్ రిటైర్ కావడం, కేహార్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేశారు. 2-పీపీఎఫ్ ఉండగా వ్యక్తిగత రుణాలెందుకు? శకునాలు చెప్పే బల్లి కుడితితొట్లో పడిందన్న సామెత చందంగా... ఆర్థిక వ్యవహారాల్లో మహా జాగ్రత్తపరులకు కూడా కొన్నిసార్లు విపత్కరపరిస్థితులు ఎదురవుతుంటాయి. అర్జెంటుగా డబ్బు అవసరమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది పర్సనల్ లోన్లు తీసుకుంటారు. లేదంటే క్రెడిట్ కార్డులను ఆశ్రయిస్తారు. ఇలాంటి రుణాలపై వడ్డీ అధికంగా ఉంటుంది. అత్యవసరంగా సొమ్ము సమకూర్చుకునే హడావుడిలో వడ్డీ భారం తక్కువగా ఉండే మార్గాలను పట్టించుకోరు. ఇలాంటి సందర్భాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రుణం తీసుకోవచ్చు. లేదంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)పై లోను పొందవచ్చు. తద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. పీపీఎఫ్ నుంచి కొంత తీసుకోవచ్చు.. ఈ అకౌంట్ నుంచి పూర్తి మొత్తం తీసుకోవాలంటే మెచ్యూరిటీ (లాకిన్ పీరియడ్) పూర్తయ్యేవరకు ఆగాల్సిందే. ఆర్థిక సంక్షోభం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించిన తర్వాత ఏడో సంవత్సరం నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే అర్హత వస్తుంది. ఒకవేళ, పీపీఎఫ్ నుంచి పాక్షిక మొత్తాన్ని ఉపసంహరించుకునే అర్హత లేకుంటే పీపీఎఫ్‌పై రుణం పొందవచ్చు. దీనికి కూడా కొన్ని షరతులున్నాయి. మూడో ఆర్థిక సంవత్సరం తర్వాత మొదటి సారి రుణం తీసుకోవచ్చు. ఆరో ఆర్థిక సంవత్సరం తర్వాత రెండో సారి లోన్ పొందవచ్చు. అయితే, అంతకుముందు తీసుకున్న రుణాన్ని సక్రమంగా తీర్చి ఉండాలి. ఎంత రుణం తీసుకోవచ్చంటే... నాలుగో ఆర్థిక సంవత్సరంలో లోన్ తీసుకోవాలని అనుకుంటే రెండో ఆర్థిక సంవత్సరం చివరలోని బ్యాలెన్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఐదో సంవత్సరంలో రుణం తీసుకోవాలనుకుంటే మూడో ఏడాది చివరి బ్యాలెన్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ బ్యాలెన్సులో గరిష్టంగా 25 శాతం రుణం ఇస్తారు. పీపీఎఫ్ రుణంపై వడ్డీ రేటు పీపీఎఫ్ బ్యాలెన్సుపై చెల్లిస్తున్న వడ్డీ కంటే రెండు శాతం ఎక్కువ. అంటే, పీపీఎఫ్ అకౌంటుపై వడ్డీ 8.8 శాతంగా ఉంటే, పీపీఎఫ్ లోన్‌పై వడ్డీ రేటు 10.8 శాతంగా ఉంటుంది. ఇతర వడ్డీ రేట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువే కదా. 36 నెలల్లో తిరిగి చెల్లించాలి... పీపీఎఫ్‌పై తీసుకున్న రుణాలను గరిష్టంగా 36 నెల ల్లోగా తిరిగి చెల్లించేయాలి. అసలును, వడ్డీని విడివిడి గా చెల్లించవచ్చు. నిర్ణీత వ్యవధిలోగా రుణం చెల్లించకపోతే వడ్డీ రేటు నాలుగు శాతం పెరుగుతుంది. -
సహారా కేసులో తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: సహారా కేసుకు సంబంధించి రెండు అంశాల్లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తన తీర్పును సోమవారం రిజర్వ్ చేసుకుంది. సహారా చీఫ్ సుబ్రతారాయ్, మరో ఇద్దరు డెరైక్టర్ల నిర్భంధం రాజ్యాంగ విరుద్ధమని దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్‌పై తీర్పు ఇందులో ఒకటి. మరొకటి రాయ్, ఇద్దరు డెరైక్టర్ల జైలు నుంచి విడుదలకు సంబంధించి రూ.10 వేల కోట్ల చెల్లింపులపై సహారా తాజా గా దాఖలు చేసిన ప్రతిపాదనపై తీర్పు మరొకటి. తాజా ప్రతిపాదన ఇదీ... బెయిల్‌పై రాయ్ విడుదలకు రూ.10,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి సహారా న్యాయవాదులు తాజాగా ఒక ప్రతిపాదన చేశారు. జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ ఈ తాజా ప్రతిపాదన సమర్పించారు. దీని ప్రకారం... రాయ్‌ని విడుదల చేసిన మూడు పనిదినాల్లో అంటే ఏప్రిల్ 25 నాటికి రూ.3,000 కోట్లను సంస్థ చెల్లిస్తుంది. మరో రూ.2,000 కోట్లను మే 30లోపు చెల్లిస్తుంది బ్యాంక్ గ్యారంటీ రూ.5,000 కోట్లను చెల్లించడానికి సంస్థ జూన్ 30 వరకూ సమయం కోరింది. దీనితోపాటు నిబంధనలకు వ్యతిరేకంగా మదుపరుల నుంచి డబ్బు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు గ్రూప్ కంపెనీలు- ఎస్‌ఐఆర్‌ఈసీఎల్, ఎస్‌హెచ్‌ఐసీఎల్ బ్యాంక్ అకౌంట్ల ‘డీఫ్రీజ్’ను కూడా న్యాయవాది కోరారు. విక్రయించదలచిన కొన్ని ఆస్తులపై ఉన్న ఆంక్షలను సైతం ఎత్తివేయాలని సహారా కోరింది. దీనికితోడు మార్చి 26న జారీ చేసిన ఉత్తర్వుల్లో కొన్ని మార్పులను సైతం కోరుతున్నట్లు ధర్మాసనానికి సహారా న్యాయవాది విజ్ఞప్తి చేశారు. రాయ్ విడుదలకు రూ.5,000 కోట్ల నేషనలైజ్డ్ బ్యాంక్ గ్యారంటీని సుప్రీంకోర్టు అప్పట్లో (మార్చి 26) నిర్దేశించింది. అయితే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ గ్యారంటీగా దీనిని మార్చాలని విజ్ఞప్తి చేసింది. ధిక్కరణపై ఇలా...: మదుపరుల నుంచి రూ.20,000 కోట్లకు పైగా డబ్బు వసూళ్ల కేసులో సెబీ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ పెండింగులో ఉండగానే రాయ్, ఇద్దరు డెరైక్టర్లను జైలుకెలా పంపుతారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, తక్షణం ఆయన్ను విడుదల చేయాలని ఇంతక్రితం గ్రూప్ తన వాదనలను వినిపించింది. అయితే ‘అరెస్ట్‌కు మేము ఉత్తర్వులు ఇవ్వలేదు. అదే చేస్తే ఆయనను సాధారణ జైలుకే పంపి ఉండేవాళ్లం. జ్యుడీషియల్ కస్టడీకి మాత్రమే మేము ఆదేశాలు ఇచ్చాం. ఆయన మా కస్టడీలో ఉన్నారు’ అని ధర్మాసనం అప్పట్లో వ్యాఖ్యానించింది. మార్చి 4 నుంచీ రాయ్ తీహార్ జైలులో ఉన్నారు. -
తీహార్ జైల్లోనే సుబ్రతారాయ్
ఢిల్లీ: సహారా గ్రూప్ కేసును సుప్రీం కోర్టు ఏప్రిల్ 9వ తేది వరకూ వాయిదా వేసింది. అప్పటివరకూ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరిలు తీహార్ జైల్లోనే ఉంటారు. వీరు ముగ్గురూ మార్చి 4 నుంచి జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే పది వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు సహారా గ్రూప్‌ను ఆదేశించింది. ఇప్పటికిప్పుడు 10 వేల కోట్ల రూపాయలు చెల్లించలేమని సహారా గ్రూప్ సుప్రీంకోర్టు ముందు చేతులెత్తేసింది.తాము తక్షణమే 2.500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించగలమని కోర్టుకు తెలిపారు. మూడు వారాల తర్వాత మరో 2.500 కోట్ల రూపాయలు చెల్లిస్తామని సహారా గ్రూప్ విన్నవించింది. దాంతో ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.