సంజయ్ రౌత్ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : బీజేపీ మిత్రపక్షం శివసేన ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి విమర్శల వర్షం కురిపించింది. పాకిస్తాన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ మోదీని ఘాటుగా ప్రశ్నించింది. సరిహద్దుల్లో ప్రాణాలు కొల్పోయిన పాక్ సైనికుల మృతికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ఆర్మీ ఛీప్ ఖమర్ జావేద్ బజ్వా ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శనివారం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. 56 అంగుళాల ఛాతి గల మోదీ దాయాది దేశం వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కశ్మీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని.. ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ఆయన మాదీరిగానే పాక్ విషయంలో ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నారని దుయ్యబట్టారు.
భారత్-పాక్ మధ్య ఎన్నో ఏళ్లుగా వివాదంగా ఉన్న పాక్ కశ్మీర్ కశ్మీర్‌పై (పీవోకే) శాశ్వాత చర్యలు చేపడతామని 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ వాగ్ధానం చేశారని గుర్తుచేశారు. నాలుగున్నర ఏళ్ల బీజేపీ పాలనలో పాకిస్తాన్‌పై ప్రకటనలు తప్ప ఏమీ చేయలేదని రౌత్ విమర్శించారు. ఓవైపు పాకిస్తాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్ భారత్‌తో శాంతి చర్చలు జరుపుతామని ప్రకటిస్తుంటే.. మరోవైపు ఆర్మీ ఛీప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పాక్ తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. పాక్‌కు మాటలతో కాదని.. బులెట్లతోనే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment