మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం ఝలక్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి శుక్రవారం సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. ఎన్నారై డాక్టర్, ఆమె తల్లి విషయంలో ప్రభుత్వం వల్ల పొరపాటు జరిగినందుకు ఇరువురికి రూ.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రిని జోహర్ డాక్టర్ కాగా, ఆయన తల్లి గుల్షన్ జోహర్ పుణే జిల్లా కోర్టులో 36 ఏళ్లుగా లాయర్ వృత్తి నిర్వహిస్తున్నారు. ఇటీవల విక్రమ్ రాజ్ పుత్ అనే వ్యక్తి రిని జోహర్ వద్ద రూ.2.5 లక్షల విలువ చేసే కొన్ని వస్తువులు, ఓ ల్యాప్ టాప్ కొనుగోలు చేశాడు. అయితే అవి పనిచేయడం లేదని వారిపై భోపాల్ లో ఫిర్యాదు చేశాడు. అయితే మధ్యప్రదేశ్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. సరైన విచారణ చేయకుండా మహిళను అదుపులోకి తీసుకోవడంపై కూడా ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
అయితే జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివ కీర్తి ధర్మాసనం ఈ కేసును విచారించింది. సివిల్ పరమైన కేసును మరో పద్ధతిలో ట్రీట్ చేశారని, క్రిమినల్ రంగు పులిమి చట్టాలను దుర్వినియోగం చేశారని ధర్మాసనం భావించింది. లోకాయుక్త పోలీసులను ఆశ్రయించి తమకు రూ.10 లక్షల నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ధర్మాసనం మూడు నెలల గడువులోగా డాక్టర్, ఆమె తల్లికి చెరో రూ.5 లక్షలు చొప్పున చెల్లించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.