మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
నాందేడ్ న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి అశోక్‌రావ్ చవాన్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అశోక్ చవాన్‌కు వరుసకు బావ అయ్యే భాస్కర్‌రావ్ పాటిల్ ఖత్గావోంకర్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పృథ్వీరాచ్ చవాన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నారాయణ్ రాణే తన మంత్రి పదవికి రాజీనామా చేయగా, అశోక్ చవాన్ తీరు నచ్చక భాస్కర్‌రావ్ పాటిల్ ఖాత్గావోంకర్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా దుమారమే రేపుతోంది.
భాస్కర్‌రావ్ పార్టీకి రాజీనామా చేస్తే మరాఠ్వాడాలో రాజకీయంగా కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే తగులుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలపై భాస్కర్‌రావ్‌ను మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు... ‘అవును పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్న విషయం నిజమే. అయితే భవిష్యత్ కార్యచరణ గురించి ఇప్పటికి ఏమీ ఆలోచించలేదు. తమ పార్టీలో చేరాలని ఇతర పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. ఏ పార్టీలో చేరాలనే విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
నేను పార్టీని వీడేందుకు ప్రధాన కారణం అశోక్ చవాన్ వైఖరే. ఆయన కోసం తన ఎంపీ సీటును వదులుకున్నాను. ఎన్నికల్లో ప్రచారం చేశాను. కాని ఆయన నుంచి నాకు కనీసం గౌరవం కూడా లభించడంలేదు. అశో క్ చవాన్‌కు కార్యకర్తలను గౌరవించడం రాదు. ఇది నాకెంతో అసంతృప్తిని కలిగించింది. గౌరవం లభిం చని చోట ఉండ కూడదనుకున్నా. పార్టీని వీడడమే మేలని నిర్ణయించుకున్నాన’ని చెప్పారు.
బుజ్జగింపులు మొదలు..
పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన భాస్కర్‌రావ్ పాటిల్ ఖత్గావోంకర్‌ను బుజ్జగించే ప్రయత్నాలను చవాన్ వర్గం మొదలుపెట్టింది. నాందేడ్ జిల్లా ఇం చార్జీ మంత్రి డి.పి. సావంత్, ఎమ్మెల్యే ఓం ప్రకాష్ పోకర్ణీలు భాస్కర్‌రావ్‌తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న బంధుత్వాన్ని(చవాన్ సోదరి స్నేహలతతో భాస్కర్‌రావ్‌కు వివాహమైంది) దృష్టిలో ఉంచుకోవాలని, రాజకీయంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంవల్ల చవాన్‌కే కాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం కలుగుతుందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.