
'20 రాష్ట్రాల్లో జాయింట్ వెంచర్ కంపెనీలు'
రాంఛీ (జార్ఖాండ్): అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కనీసం 20 రాష్ట్రాలలో ప్రత్యేక జాయింట్ వెంచర్ కంపెనీలలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. రైల్వే ప్రాజెక్టులను గడువులోగానే పూర్తిచేసేందుకు ఈ వెంచర్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఒక నెల వ్యవధిలో జార్ఖాండ్ లో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇదే విధంగా ప్రాజెక్టుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించేందుకు ఈ-టెండర్ల రూపంలో పనులు చేపడతామన్నారు. రైల్వే విభాగంలో ఈ-కాటరింగ్ విధానం ద్వారా ప్రయాణికులకు నచ్చిన భోజనాన్ని పొందే వీలు కల్పించామన్నారు. అయితే, కేంద్ర ప్రారంభించిన, రూపకల్పన చేసిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 3 నుంచి ఐదేళ్లు పడుతుందని సురేష్ ప్రభు పేర్కొన్నారు.