
సాక్షి, ముంబై : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన మరోసారి తీవ్రస్థాయిలో విరుచకుపడింది. కేంద్రం తాజాగా అమలు చేయాలనుకుంటున్న ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ (ఎఫ్‌ఆర్‌డీఐ)పై శివసేన తన అధికార పత్రిక అయిన సామ్నాలో తీవ్ర విమర్శలు చేసింది. ప్రజలనుంచి డబ్బును లూటీ చేయడం కోసమే కేంద్రం ఎఫ్‌ఆర్‌డీఐ చట్టాన్ని తీసుకువస్తోందని శివసేన దాడి చేసింది.
కేంద్రప్రభుత్వం రూపొందించిన ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు... ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆయన చెప్పారు. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ప్రజల సొమ్మును బ్యాంకలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉందని శివసేన విమర్శించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే దివాళా తీసిన బ్యాంకులు.. డిపాజిటర్ల డబ్బులను స్వేచ్ఛగా ఉపయోగించుకుంటాయని చెప్పారు. ఇప్పటికే లోక్‌సభ ముందున్న ఈ బిల్లుపై శీతాకాల సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment