ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: మేడే రోజున వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే రైల్వే శాఖ నడిపే ప్రత్యేక ‘శ్రామిక్ రైళ్ల’లో మాత్రమే వీరు ప్రయాణించాల్సి ఉంటుంది. వలస కార్మికులతో పాటు విద్యార్థులు, వివిధ కారణాలతో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు ఈ రైళ్లలో తమ సొంతూళ్లకు వెళ్లిపోవచ్చని కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల కోసం నోడల్ అధికారులను నియమిస్తుందని.. వీరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ వలస కార్మికులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తారని రైల్వే శాఖ తెలిపింది. వీటికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
► రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే నిబంధనల మేరకు ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లు నడుపుతారు. వీటి సమన్వయానికి రైల్వే శాఖ, రాష్ట్రాలు సీనియర్ ఆఫీసర్లను నోడల్ అధికారులుగా నియమించాలి.
► ప్రయాణికులు రైలు ఎక్కే ముందు వారిని పంపించే రాష్ట్రాలు స్క్రీనింగ్ నిర్వహించాలి. కోవిడ్-19 లక్షణాలు లేవని తేలిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి.
► శానిటైజ్ చేసిన బస్సుల్లో ప్రయాణికులను బ్యాచ్‌ల వారీగా రైల్వే స్టేషన్‌కు తీసుకురావాలి. ప్రయాణికులు ముఖానికి మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలి. (3 తర్వాత లాక్‌డౌన్ సడలింపు పక్కా..)
► ప్రయాణికులను పంపే రాష్ట్రమే వారికి భోజనం, తాగునీరు రైలు ఎక్కేముందు సమకూర్చాలి. ఒకవేళ ఎక్కువ దూరం ప్రయాణించాల్సివుంటే రైళ్లలోనే భోజన ఏర్పాట్లు చేస్తారు.
► ప్రయాణికులు గమ్యానికి చేరుకున్నాక సదరు రాష్ట్ర ప్రభుత్వం వారికి స్క్రీనింగ్ చేయాలి. అవసరమనుకుంటే క్వారంటైన్‌కు తరలించాలి. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు వారి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా ఏర్పాట్లు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment