ముంబై: సినీ నటులు, వారసులు వ్యాపారవేత్తలుగా మారడం సాధారణం. వ్యాపార దిగ్గజాల వారసులు నటనను కెరీర్గా ఎంచుకోవడం మాత్రం అరుదు. లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ యజమాని విజయ మాల్యా తనయుడు సిద్ధార్థ మాల్యా నటుడు కావాలని నిర్ణయించుకున్నారు. లండన్లోని ప్రఖ్యాత రాయల్ సెంట్రల్ స్కూల్లో శిక్షణ పొందనున్నారు. యాక్టింగ్లో మాస్టర్ డిగ్రీ చేయబోతున్నట్టు సిద్ధార్థ స్వయంగా వెల్లడించారు.
'నటనను కెరీర్గా ఎంచుకున్నాను. ఈ పరిశ్రమలో పోటీపడాలంటే నటనలో మెరుగైన శిక్షణ పొందడం చాలా అవసరం. రాయల్ సెంట్రల్ స్కూల్లో శిక్షణ పొందేందుకు సీటు వచ్చింది' అని సిద్ధార్థ ట్వీట్ చేశారు. అన్నట్టు సిద్ధార్థకు నటనలో ప్రమేయముంది. రెండు షార్ట్ ఫిల్మ్స్లో నటించారు. ఇక సినీ, క్రీడా ప్రముఖులతో కూడా సంబంధాలున్నాయి. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు వెంట ఉంటూ టీవీలో కనిపిస్తుంటారు. బాలీవుడ్ భామలతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి.
లండన్ యాక్టింగ్ స్కూలుకు మాల్యా వారసుడు
Published Wed, Apr 29 2015 7:13 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM
Advertisement