సెంట్రల్‌ వర్సిటీల్లో యోగా శాఖలు | Six Central Universities To Have Yoga Departments | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 3 2018 8:07 AM | Last Updated on Tue, Apr 3 2018 8:07 AM

 Six Central Universities To Have Yoga Departments - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా యోగా డిపార్టుమెంట్‌ను ఏర్పాటుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖ నిర్ణయించింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హెచ్‌ఆర్‌డీ శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ మంగళవారం ఈ విషయం చెప్పారు.

ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ,  హేమ్‌వతి నందన్‌ బహుగుణ గర్వాల్‌ యూనివర్సిటీ, విశ్వభారతి, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్, మణిపూర్‌ యూనివర్సిటీల్లో కొత్తగా యోగా శాఖలను ఏర్పాటుచేయనున్నారు. ఈ వర్సిటీల్లో యోగా శాఖల ఏర్పాటుకు యూజీసీ ఇప్పటికే అనుమతినిచ్చిందని సత్యపాల్‌ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement