ముంబై: కేంద్రం చేపట్టిన 100 స్మార్ట్ సిటీల నిర్మాణానికి వచ్చే ఐదేళ్లలో 150 బిలియన్ డాలర్లు (రూ.10లక్షల కోట్లు) అవసరమవుతాయని ఓ నివేదిక తెలిపింది. ఇందుకోసం ప్రైవేటు రంగం ప్రధాన భాగస్వామిగా మారాల్సిందేనంది. డెలాయిట్ సంస్థ విశ్లేషణ ప్రకారం 120 బిలియన్ డాలర్లు ప్రైవేటు రంగం నుంచి రానున్నట్లు అంచనా. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులోభాగంగా నగరమంతా వై-ఫై సర్వీసులు అందించేందుకు సర్వీసు ప్రొవైడర్లు, కంటెంట్ ప్రొవైడర్లదే కీలక పాత్ర అని నివేదిక పేర్కొంది.
అయితే 50 స్మార్ట్ సిటీల్లో వై-ఫై సేవలందించేందుకు రిలయన్స్ జియో ముందుకు రాగా, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు సంయుక్తంగా సేవలందించాలని భావిస్తున్నాయి. కాగా.. 100 స్మార్ట్‌సిటీలు, 500 అమృత్ నగరాలకోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా 7.513 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 వేల కోట్లు) ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
స్మార్ట్ సిటీలకు 10 లక్షల కోట్లు అవసరం: నివేదిక
Published Mon, Feb 1 2016 1:10 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement