మయన్మార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్రజాస్వామ్య ఉద్యమనేత, ప్రతిపక్ష ఎన్‌ఎల్‌డీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అభినందించారు.
యాంగోన్: మయన్మార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్రజాస్వామ్య ఉద్యమనేత, ప్రతిపక్ష ఎన్‌ఎల్‌డీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అభినందించారు. భారత్తో సూచీకి ప్రత్యేక అనుబంధముందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దిగువ సభ, ఎగువ సభ కలిపి 664 సీట్లున్న మయన్మార్ పార్లమెంట్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 329 మెజార్టీ మార్క్ను ఎన్‌ఎల్‌డీ దాటింది. మెజార్టీకి అదనంగా మరో 21 సీట్లు గెల్చుకుని క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.