త్వరలో కొత్త 20, 50 నోట్లు | Soon the new 20, 50 notes | Sakshi
Sakshi News home page

త్వరలో కొత్త 20, 50 నోట్లు

Published Mon, Dec 5 2016 1:27 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

త్వరలో కొత్త 20, 50 నోట్లు - Sakshi

త్వరలో కొత్త 20, 50 నోట్లు

పాతవి కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ ప్రకటన
రూ. 2 లక్షల కోట్లు, రూ13,860 కోట్ల ఐడీఎస్ మొత్తాల్ని తిరస్కరించిన ఐటీ
- ఆ మొత్తాల వెనకున్న అసలు వ్యక్తుల వేటలో ఐటీ శాఖ
- మొబైల్ రీచార్జ్‌కు పాత 500 నోటు తీసుకోవాల్సిందే
 
 న్యూఢిల్లీ: రూ. 2వేలు, రూ. 500 కొత్త నోట్లకు తోడుగా త్వరలో రూ. 20, రూ. 50 కొత్త నోట్లు కూడా మార్కెట్లోకి రానున్నాయి. అందుకోసం ఆర్‌బీఐ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే కొత్తవి విడుదలైనా సరే పాత రూ. 20, రూ. 50 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. పాత నోట్లకు ఉన్న భద్రతా ప్రమాణాలే కొనసాగుతాయని, రూ. 20, రూ.50 కొత్త నోట్ల ముద్రణలో ఇంటాగ్లియో టెక్నాలజీ వాడడం లేదని వెల్లడించింది. ‘త్వరలో మహాత్మాగాంధీ సిరీస్-2005లో కొత్త రూ.20 నోటు విడుదల చేస్తున్నాం. ఎల్ సిరీస్‌లో రెండు సెట్ల నంబర్లు మొదలవుతాయి. నోటుపై ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. ముద్రణ సంవత్సరంగా 2016 ఉంటుంది’ అని ఆర్‌బీఐ తెలిపింది. డిజైన్, భద్రతా ప్రమాణాలు ప్రస్తు త రూ.20 నోటులో ఉన్నవే కొనసాగిస్తామని, నోటుపై సంఖ్య ఆరోహణ క్రమంలో ఉంటుందని వెల్లడించింది. కొత్త రూ. 50 నోటుపై ఆర్‌బీఐ వివరణఇస్తూ... ‘మహాత్మాగాంధీ సిరీస్- 2005లో భాగంగా రూ. 50 కొత్త నోటు విడుదల చేస్తున్నాం. నంబర్‌లో ఎలాంటి అక్షరాలు ఉండవు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ సంతకంతో పాటు, 2016 ముద్రణ సంవత్సరంగా ఉంటుంది. డిజైన్, భద్రతా ప్రమాణాలు పాత నోటులో ఉన్నవే కొనసాగుతారుు. నోటుపై అంకెలు ఆరోహణ క్రమంలో ఉంటారుు. అలాగే ఇంటాగ్లియో ముద్రణ సాంకేతికతను ఉపయోగించడం లేదు’ అని పేర్కొంది.

 ఆ మొత్తాలపై అనుమానం...
 ఆదాయం వెల్లడి పథకం(ఐడీఎస్)లో ప్రకటించిన రెండు భారీ మొత్తాల్ని ఐటీ శాఖ తిరస్కరించింది. అనుమానాస్పదంగా ఉండడంతో రూ. 2 లక్షల కోట్లు, రూ. 13,860 కోట్లు వెల్లడించిన ఆదాయాల్ని నమోదు చేయలేదని ఐటీ శాఖ తెలిపింది. తప్పుడు వివరాలు సమర్పించడం వెనుక ఉన్న కారణాలు కనుగొనేందుకు విచారణ కొనసాగిస్తున్నామని వెల్లడించింది. ఐడీఎస్ ద్వారా వెల్లడైన మొత్తాన్ని ప్రభుత్వం మరోసారి సవరించింది. ప్రస్తుతమున్న రూ. 65,250 కోట్ల నుంచి రూ. 67,382 కోట్లకు లెక్కను సవరించారు. ‘మాకు అందిన డిక్లరేషన్లలో... రెండు భారీ మొత్తాల్ని మేము పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే అవి అనుమానాస్పదంగా ఉండడంతో పాటు డిక్లరేషన్లు ప్రకటించినవారు చిన్నస్థారుు వ్యక్తులు కావడమే అందుకు కారణం’ అని ఐటీ శాఖ తెలిపింది.

 ‘రూ. 2 లక్షల కోట్ల ఐడీఎస్‌లో అబ్దుల్ రజాక్ మొహమ్మద్ సయ్యద్(ప్రకటించిన వ్యక్తి), మొహమ్మద్ ఆరిఫ్ అబ్దుల్ రజాక్ సయ్యద్(కుమారుడు), రుక్సానా అబ్దుల్ రజాక్(భార్య), నూర్జహాన్(చెల్లెలు)ల పేర్లను డిక్లరేషన్‌లో కుటుంబసభ్యులుగా పేర్కొన్నారు. ఫ్లాట్ నెం. 4, గ్రౌండ్ ఫ్లోర్, జూబిలీ కోర్టు, 269-బీ, టీపీఎస్-3, లింకింగ్ రోడ్, బాంద్రా(వెస్ట్), ముంబైని చిరునామాగా వెల్లడించారు. ఇక రూ. 13,860 కోట్లు పేర్కొన్న మహేష్ కుమార్ షా అహ్మదాబాద్ చిరునామా ఇచ్చాడు.’ అని ఆదాయపు శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 30న ఈ రెండింటిని తిరస్కరించాలని నిర్ణరుుంచామని, తప్పుడు ఆదాయం వెల్లడి వెనుక అసలు కారణాలు వెలికితీస్తున్నామని తెలిపింది. కాగా, మహేశ్ షాను ఐటీ సిబ్బంది శనివారం రాత్రంతా విచారించారు. అనంతరం ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లడానికి అనుమతించారు. షా ప్రాణానికి ముప్పు ఉన్నందున పోలీసులు ఆయన ఇంటి వద్ద రక్షణ కల్పించారు.

 డిజిటల్‌ను ప్రోత్సహిస్తే కలెక్టర్లకు 5 లక్షలు
 డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించేలా జిల్లా కలెక్టర్లకు ప్రోత్సహకాలు ఇవ్వాలని నీతి ఆయోగ్ నిర్ణరుుంచింది. జిల్లా కలెక్టర్ పరిపాలనా పరిధిలో జరిగే ప్రతీ డిజిటల్ చెల్లింపునకు రూ. 10 చొప్పున రివార్డు ఇస్తామంది. దేశంలోని ప్రతీ జిల్లాకు తక్షణం రూ.5 లక్షల చొప్పున నగదు బదిలీ చేయనుంది.
 
 పన్ను పరిధిలో లేని ఖాతాల్లో భారీ నగదు
 జన్‌ధన్ ఖాతాల్లో అనేక అవకతవకల్ని ఐటీ శాఖ గుర్తించింది. దాదాపు రూ.1.64 కోట్ల డిపాజిట్లను పరిశీలించగా.. ఖాతాదారులు ఇంతకముందు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయనట్లు కనుగొంది. కోల్‌కతా, మిడ్నాపూర్, అరా(బిహార్), కొచి, వారణాసిలో ఈ అనుమానాస్పద ఖాతాల్ని పరిశీలించింది. మొత్తం రూ.1.64 కోట్ల అప్రకటిత నగదు ఖాతాల్లో జమకాగా... ఖాతాదారుల ఆదాయపన్ను కట్టాల్సిన పరిధి కంటే తక్కువ ఉన్నట్లు గుర్తించారు. బిహార్‌లో ఒక జన్‌ధన్ ఖాతాలో రూ. 40 లక్షలు  జమయ్యారుు. నవంబర్ 9కి ముందు జన్‌ధన్ ఖాతాల్లో 25.85 కోట్లు ఉండగా... నవంబర్ 30 నాటికి రూ. 74,321.55 కోట్లు జమయ్యారుు. దేశంలో పన్ను చట్టాల్లో సంస్కరణలు అవసరమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా అన్నారు.
 
 మైక్రో ఏటీఎంలు, పీఓఎస్‌లతో హ్యాక్ ముప్పు
 నోట్ల రద్దు అనంతరం మైక్రో ఏటీఎంలు, పీఓఎస్ యంత్రాల వినియోగం భారీగా పెరిగాయని, అరుుతే వాటిపై సైబర్ దాడులు చేసి సమాచారం తస్కరించవచ్చని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈ ఆర్‌టీ హెచ్చరించింది. మైక్రో ఏటీఎంల భద్రతను బలోపేతం చేయాల్సిన అవసరముందని, వినియోగదారులు, బ్యాంకుల సమాచారం చోరీకి హ్యాకర్లు చేసే యత్నాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలంది. పీఓఎస్ యంత్రాల్లో నిక్షిప్తం చేసే వివరాలు మెమొరీలో అలానే ఉండిపోతాయని, వాటిని దొంగిలించే యత్నాలు  జరగవచ్చని పేర్కొంది. మొబైల్ రీచార్జ్ కోసం వినియోగదారుల నుంచి పాత 500 నోట్లు తప్పకుండా తీసుకోవాలని, అదే సమయంలో రిటైలర్స్, డిస్టిబ్యూటర్స్‌ను మాత్రం ఒత్తిడి చేయలేమని సెల్యూలార్ ఆపరేటర్ల సంఘం చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement