![జయ కేసులో సుప్రీంకు వెళ్లనున్న కర్ణాటక - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71431337562_625x300_3.jpg.webp?itok=2-kwleTP)
జయ కేసులో సుప్రీంకు వెళ్లనున్న కర్ణాటక
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఈనెల 21న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. హైకోర్టు తీర్పుపాఠంపై సిద్ధరామయ్య ప్రభుత్వం న్యాయనిపుణులతో సైతం ఇప్పటికే చర్చించింది.