న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. నిర్భయ నిధులు ఖర్చు చేయకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల రక్షణ, మర్యాదలను కాపాడే చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్భయ ఫండ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అత్యాచార బాధితులకు నష్టపరిహారం, సాక్షుల రక్షణకు జాతీయస్థాయిలో ప్రణాళిక రూపొందించాలని సూచించింది. నిర్భయ నిధులను ప్రతి ఏటా కేటాయిస్తున్నా వేల కోట్ల రూపాయలు నిరూపయోగంగా ఉంటున్నాయి.