బాణసంచా అమ్మకాలపై బ్యాన్
బాణసంచా అమ్మకాలపై బ్యాన్
Published Fri, Nov 25 2016 2:49 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
దేశరాజధాని ప్రాంతమైన ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బాణసంచా అమ్మకాలపై నిషేధం విధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రాంతంలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం దృష్ట్యా ఈ ఆదేశాలు జారీచేసింది. దీపావళి బాణసంచా పేలుళ్ల వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలపై మూడు నెలల్లోగా సమాధానం దాఖలు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది.
శుక్రవారం నుంచి తాము తదుపరి ఉత్తర్వులు వెలువరించేవరకు అన్నిరకాల దీపావళి బాణసంచా అమ్మకాలపై నిషేధం విధించాలని, దాన్ని తక్షణం అమలుచేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువ అవుతుండటంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకుని, బాణసంచా అమ్మకాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీచేయాలని కోరుతూ పలువురు పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ల విచారణ సందర్భంగానే కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
Advertisement