
ఇరాక్ సంక్షోభంపై సుష్మా సమీక్ష
న్యూఢిల్లీ: భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఇరాక్ సంక్షోభంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇరాక్లో ఉన్న భారతీయులను కాపాడటానికి విదేశాంగ శాఖ అధికారులు ఇరాక్తో నిరంతరం సంప్రదిస్తున్నారు.
ఇరాక్లో సైనికులకు, తీవ్రవాదులకు మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. తీవ్రవాదుల చెరలో ఉన్న టిక్రిట్ నగరంలో 44 మంది కేరళ నర్సులు పనిచేస్తున్నారు. వీరందరూ భద్రంగానే ఉన్నారని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఓ ఆస్ప్రత్రిలో పనిచేస్తున్న భారతీయ నర్సులను అంతర్జాతీయ రెడ్ క్రిసెంట్ సొసైటీ వలంటీర్లు వెళ్లి చూశారని, వాళ్లంతా గత వారం రోజులుగా అక్కడ చిక్కుకున్నారని బాగ్దాద్లోని భారత రాయబారి అజయ్ కుమార్ తెలిపారు.