ఠాగూర్ పాఠ్యాంశాలను తొలగించట్లేదు..
న్యూఢిల్లీ: పాఠ్యపుస్తకాల నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును తొలగించట్లేదని కేంద్రమానవ వనరుల శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఈమేరకు రాజ్యసభలో జీరో అవర్‌లో తృనముల్ కాంగ్రస్ ఎంపీ దేరక్ ఒబ్రైన్ అగిన ప్రశ్నకు జవదేకర్ స్పందించారు. దేశం కోసం పాటుపడిన కవి, జాతీయ గీతం రచయత ఠాగూర్‌తోపాటు అందరిని బీజేపీ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.
పాఠ్యపుస్తకాల్లో దేనిని తొలగించట్లేదని, కేవలం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఉన్న లోపాలను తెపాలని కోరినట్లు తెలిపారు. దీంతో పాటు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ పుస్తకాల్లోని ఉర్దూపదాలను తొలగించాలని సూచించారు. దీనిపై మెత్తం ఏడువేల సూచనలు, సలహాలు వచ్చాయన్నారు. సమస్యలు తలెత్తే ఏ పనిని కూడా తాము చేయబోమని మంత్రి తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్‌కు ఎవరి సర్టిఫికేట్, మద్దతు అవసరం లేదని ఆయన అన్నారు.