ఢిల్లీ: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. ఆదివారం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎప్రిల్ 22న హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని ఆయన తెలిపారు. తెలంగాణలో కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల అధ్యయనానికి బీజేపీ కమిటీ వేస్తుందని లక్ష్మణ్ వెల్లడించారు.
పార్టీ బలోపేతానికి మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జిల్లాలో నాయకత్వాన్ని బలపరచాలని లక్ష్మణ్కు సలహా ఇచ్చారు. ఏపీ పునర్ విభజన చట్ట సవరణ బిల్లుపై సమాలోచనలు చేస్తున్నామని, అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలా లేదా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
అదే రోజు బాధ్యతలు స్వీకరిస్తా: లక్ష్మణ్
Published Sun, Apr 17 2016 4:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement