సమావేశంలో మాట్లాడుతున్న మోదీ
సాక్షి, చెన్నై: దేశంలోనే కాక ప్రపంచంలో తమిళ భాష చాలా ప్రాచీనమైనదని, ఉన్నతమైనది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో తమిళ భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశ వ్యాప్తంగా హిందీని అమలు చేయాలన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమయిన నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికయిన తరువాత మోదీ తొలిసారి తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. తమిళ భాషకు చాలా చారిత్రాత్మక, ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇటీవల తాను ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన వేళ తమిళ పదాలను కూడా వాడానని ఆయన గుర్తుచేశారు. అలాగే ఏక ఉపయోగ ప్లాస్టిక్ వస్తువుల వాడకం పూర్తిగా నిషేధించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యవరణం తీవ్రంగా దెబ్బతింటోందని, ప్రజలంతా దీనిని ఓ ఉద్యమంలా భావించాలని మోదీ కోరారు. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 56వ స్నాతకోత్సవానికి మోదీ ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment