ప్రియురాలిపై విరుచుకుపడ్డాడు.. జైలుకెళ్లాడు..! | Teenager in a critical condition after lover stabs her in bihar gaya | Sakshi
Sakshi News home page

ప్రియురాలిపై విరుచుకుపడ్డాడు.. జైలుకెళ్లాడు..!

Published Sun, May 15 2016 11:49 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

Teenager in a critical condition after lover stabs her in bihar gaya

పాట్నా: బిహార్ లో దారుణం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఉన్న ఓ యువకుడు  ప్రేయసిని చితకబాదాడు. ఈ ఘటన బిహార్ లోని గయ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గయ పట్టణంలో లవర్స్ మధ్య చిన్న గొడవ తలెత్తింది. క్షణికావేశంలో లవర్ ఆ టీనేజీ యువతిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఇది గమనించిన స్థానికులు ప్రియుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ యువకుడిని  గయ పోలీసులకు అప్పగించారు.

ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన టీనేజీ యువతిని గయలోని మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం పాట్నాలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధిత యువతిని పాట్నాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement