హుండీ డబ్బులకు లెక్క చెప్పనక్కర్లేదు | Temple money from 'hundis' not to come under scanner: Government | Sakshi
Sakshi News home page

హుండీ డబ్బులకు లెక్క చెప్పనక్కర్లేదు

Published Thu, Nov 10 2016 5:32 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

హుండీ డబ్బులకు లెక్క చెప్పనక్కర్లేదు - Sakshi

హుండీ డబ్బులకు లెక్క చెప్పనక్కర్లేదు

న్యూఢిల్లీ: దేవాలయాల హుండీల్లో జమైన డబ్బుల డిపాజిట్లపై ఎలాంటి నిఘా ఉండదని, అది పన్ను పరిశీలన అంశంగా ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ గురువారం ఒక ప్రకటన చేసింది. 'దేవాలయాల్లోని హుండీల్లోకి వచ్చిన సొమ్ము జమ చేసే సమయంలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తబోవు. ఈ డబ్బు డిపాజిట్కు పరిమితులు లేవు. హుండీల సొమ్ముకు మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నాం' అని రెవెన్యూ సెక్రటరీ హాస్ముఖ్ అధియా మీడియాకు చెప్పారు.

అయితే, ఆలయాల కింద నడుస్తున్న స్వచ్చంద సేవా సంస్థలకు మాత్రం ఈ మినహాయింపు ఉండదన్నారు. వారు డబ్బు జమ చేసే సమయంలో కచ్చితంగా రికార్డులు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నోట్లను కొత్తగా డిపాజిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. నల్లధనాన్ని, అవినీతిని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement