‘భారత్ మాతా కీ జై’ పై విపక్షాలు
న్యూఢిల్లీ: ‘భారత్ మాతా కీ జై’ నినాదంపై సోమవారం బీజేపీ, విపక్షాలు విమర్శలు చేసుకున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దీన్ని తెరపైకి తెచ్చారని, ఇలా నినదిస్తేనే జాతీయవాదమన్నట్లు ప్రచారం చేస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి. హిందూస్తాన్ జిందాబాద్, జైహింద్, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతోనూ జాతీయవాదాన్ని చాటవచ్చని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. వివిధ రకాలుగా దేశభక్తిని చాటవచ్చన్నారు.
ప్రభుత్వ వైఫల్యాల్ని పక్కదారి పట్టించేందుకు జాతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ తప్పుపట్టారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలోనే ఈ నినాదాన్ని వాడుకుంటున్నారని జేడీయూ నేత పవన్ వర్మ విమర్శించారు. తమ పార్టీకి జాతీయవాదాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, కొందరికి అఫ్జల్ గురు, యాకుబ్ మెమెన్ లాంటి దేశద్రోహులను కీర్తించడం అలవాటుగా మారిందని బీజేపీ నేత వెంకయ్యనాయుడు అన్నారు.
ఆ నినాదమే జాతీయవాదమా?
Published Tue, Mar 22 2016 1:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement