లోక్‌సభలో సీన్ రివర్స్....!
అధికార పక్షంలో బీజేపీ... విపక్షంలో కాంగ్రెస్
కొలువుదీరిన 16వ లోక్‌సభ
న్యూఢిల్లీ: కేంద్రంలో బుధవారం 16వ లోక్‌సభ కొలువుదీరింది. అయితే 15వ లోక్‌సభతో పోలిస్తే పూర్తిగా సీన్ రివర్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సభ్యులు పూర్తిస్థారుులో అధికారపక్ష బెంచీలను ఆక్రమించగా.. మునుపెన్నడూ లేని విధంగా కేవలం 44 మంది సభ్యులతో కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి దిగజారిపోరుుంది. బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తుండగా విజయదరహాసంతో మోడీ బుధవారం లోక్‌సభలో అడుగుపెట్టారు. బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ ఆయన వెన్నంటి వచ్చారు. మీగడ రంగు కుర్తా ధరించి వచ్చిన ప్రధాని ముందువరుసలోని సభ్యుల్ని చిరునవ్వుతో పలకరించారు. కాంగ్రెస్ సభ్యుల వైపునకు రాగా అప్పుడే పక్క నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ లోనికివచ్చారు. ఇద్దరూ ముకుళిత హస్తాలతో పరస్పరం పలకరించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యూదవ్‌తో మోడీ చేతులు కలిపారు.
ములాయం ప్రధానిని అభినందించడం కనిపించింది. సీటింగ్ ఏర్పాట్లు సైతం కేంద్ర ప్రభుత్వంలో చోటు చేసుకున్న మార్పును ప్రతిఫలించారుు. బీజేపీ అగ్రనేత అద్వానీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ హోదాలో ప్రధాని మోడీ పక్క సీట్లో కూర్చున్నారు. వారికి పక్కనే ఉన్న మొదటి బెంచీలో మురళీ మనోహర్ జోషీ, రాంవిలాస్ పాశ్వాన్ (ఎల్జేపీ), ఎం.వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ ఆసీనులయ్యూరు.ప్రతిపక్ష బెంచీల్లో.. మొదటి వరుసలో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే, సోనియూగాంధీ, వీరప్ప మొరుులీ, కె.హెచ్.మునియప్ప కూర్చున్నారు. రాహుల్ గాంధీ వెనుక బెంచీలో కూర్చున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు నాయకత్వం వహించేందుకు నిరాసక్తత వ్యక్తం చేసిన రాహుల్.. తొమ్మిదో వరుసలోని బెంచీల్లో అస్రార్ ఉల్ హక్, శశిథరూర్‌ల పక్కన కూర్చున్నారు. విపక్షంలో ముందు వరుసల్లో కూర్చున్నవారిలో ములాయం సింగ్ యూదవ్, సుదీప్ బందోపాధ్యాయ్ (టీఎంసీ), అర్జున్ చరణ్ సేథీ (బీజేడీ), తంబిదురై (ఏఐఏడీఎంకే) ఉన్నారు.
ముండే మరణంతో విషాదఛాయలు: కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మరణంతో లోక్‌సభ మొదటిరోజు సమావేశంలో కొంత విషాద వాతావరణం కన్పించింది. దివంగత నేతకు నివాళి అర్పించిన తర్వాత సభ మరుసటి రోజుకు వారుుదా పడింది. ముండే మృతి పట్ల ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ సంతాపం ప్రకటించారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆయన గురువారానికి వారుుదా వేశారు. అనంతరం లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్ 16వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను సభ ముందుం చారు. వారుుదా పడే ముందు ముండే మృతికి సంతాప సూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.