
వారు దాడికి పాల్పడటంలో తప్పులేదు
న్యూఢిల్లీ: తమ ముందే తల్లిదండ్రులను కొడుతున్న వారిపై పిల్లలు తిరగబడి దాడి చేయడం తప్పుకాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రాజస్థాన్‌కు చెందిన ఓ కేసును విచారిస్తున్న జస్టిస్ దీపక్ మిశ్రా, శివ కీర్తి సింగ్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తమ తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టడడంతో ఇద్దరు సోదరులు ఇంటి పక్కవారిపై దాడికి పాల్పడ్డారు. వీరిని రాజస్తాన్ దోషులుగా తేల్చగా.. సుప్రీం కోర్టు విచారించి నిర్ధోషులేనని వెల్లడించింది.