తృతీయ ఫ్రంట్ వల్ల దేశానికి హాని: మోడీ
దేశ రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటు వల్ల దేశ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. తృతీయ ఫ్రంట్ వల్ల దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని మోడీ హెచ్చరించారు.
దేశ ప్రజల ఆలోచనలకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. రాజకీయ అవకాశవాదులు కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చే విధంగా ప్రయత్నిస్తున్నారని మోడీ ఆరోపించారు.