చండీగఢ్: గురుదాస్ పూర్ ఎన్కౌంటర్లో మాజీ స్టార్ హాకీ ప్లేయర్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ జుగ్రాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన బృందంలో 32 ఏళ్ల జుగ్రాజ్ కూడా సభ్యుడు.
హాకీ నుంచి రిటైరైన తర్వాత జుగ్ రాజ్ పంజాబ్ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అమృత్సర్లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ముష్కరుల దాడి ఘటన సమాచారం తెలిసిన వెంటనే ఉదయం 8:15 గంటలకు దినానగర్ చేరుకున్నారు. అక్కడ ఎస్ఎస్పీ బృందంతో కలిసి తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొని ముష్కరులను మట్టు పెట్టారు. 2003లో జలంధర్లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత హాకీ నుంచి జుగ్రాజ్ రిటైరయ్యారు. కొన్నిరోజులు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించి హాకీ మెలకువలను ఆటగాళ్లకు నేర్పించారు. ఆ తర్వాత పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
ఉగ్రదాడిని తిప్పికొట్టిన బృందంలో మాజీ హాకీ స్టార్
Published Sun, Aug 2 2015 7:28 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM
Advertisement