gunned down
-
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని బండిపోరాలో సుంబ్లార్ ప్రాంతంలోని షోక్‌బాబా అడవిలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా గత వారం రోజుల్లోనే ఈ లోయలో పలు ఎన్కౌంటర్లు జరిగిగాయి. బారాముల్లాలోని సోపోర్‌లోని వార్పోరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఇటీ) ఉగ్రవాదులు మరణించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో సోమవారం లష్కరే తోయిబా ఉగ్రవాది, మరో గెరిల్లా మృతి చెందారు. -
ఎదురుదెబ్బ.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు మరోగట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరిపారేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత భద్రతా బలగాలు మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరంతా కూడా జకీర్ ముసా, అన్సార్ ఘజ్వాతుల్ వర్గానికి చెందిన వారిగా బలగాలు గుర్తించాయి. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పుల్వామా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం తర్వాత ఈ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. సైనిక వర్గాల సమాచారం ప్రకారం పుల్వామా జిల్లాలోని ట్రాల్ ఏరియా గులాబ్ బాగ్ ప్రాంతంలో 182 సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, ప్రత్యేక పోలీసు వర్గాలు మధ్యాహ్నం 1.30గంటల గాలింపు చర్యలు చేపడుతుండగా ఒకేసారి ఉగ్రవాదుల సమూహం కాల్పులు జరపడం ప్రారభించడంతో బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. బలగాల చేతుల్లో ఇషాక్ అహ్మద్, జహీద్ అహ్మద్, మహ్మద్ అష్రఫ్ దార్ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలపై కాల్పులు
లండన్: ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండే ఆ యువతి సాయుధుల చేతిలో ప్రాణాలుకోల్పోయింది. అప్పటి వరకు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ చల్లటి రాత్రిని ఆస్వాదిస్తూ అనూహ్యంగా మృత్యువాత పడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వాయవ్య లండన్‌లోని బ్రెంట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మోహనా అబ్దౌ అనే యువతిని అక్కడ అంతా మోంటాన అని పిలుస్తారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మోంటాన తమ ఇంటి పక్కనే ఉన్న చిన్నపిల్లలు ఆడుకునే క్రీడాస్థలానికి కొందరు స్నేహితురాళ్లతో కలిసి చేరుకుంది. వారితో కలిసి చిన్నచిన్న సరదా ఆటలు ఆడుతోంది. అదే సమయంలో బైక్‌పై ముసుగుతో వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మొత్తం సమూహంపైకి కాల్పులు జరపగా మిగితా వారంత తప్పించుకోగా దురదృష్టం కొద్ది ఒక్క మోంటానకు మాత్రం ఒకే ఒక్క బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడి చనిపోయింది. అయితే, పోలీసులు మాత్రం ఆ కాలనీకి చెందినవారే ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అందుకే, ఈ దాడికి దిగినవారు స్వయంగా లొంగిపోవడమో.. లేక తెలిసిన వారు నిజం బయటకు చెప్పడమో చేయాలని కోరుతున్నారు. -
బస్తర్‌లో ఎన్కౌంటర్
చత్తీస్ గఢ్: మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు పోలీసు బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మిగితావారు పారిపోయారు. బస్తర్ లోని తులసీ డోంగ్రీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఘటనా స్థలి వద్ద భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ప్రేమజంట కోసం జర్నలిస్టు బలి
కరాచీ: యువతి కుటుంబసభ్యుల అనుమతి లేకుండా, ప్రియుడితో ఆమె ప్రేమవివాహాన్ని సమర్థించిన ఓ జర్నలిస్టును వధువు బంధువులు కాల్చిచంపారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. యువతి తన కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోగా, అజ్మల్ జోయియా (30) అనే జర్నలిస్టు ప్రేమజంటకు అండగా నిలిచి, వారికి రక్షణ కల్పించాల్సిందిగా జిల్లా అధికారులను కోరినట్టు పోలీసులు చెప్పారు. దీంతో యువతి కుటుంబసభ్యులు అజ్మల్‌ను టార్గెట్ చేసినట్టు తెలిపారు. లోద్రాన్ జిల్లాలో అజ్మల్ బైకుపై ఇంటికి వెళ్తుండగా, ముగ్గురు సాయుధులు ఆయనను హత్యచేశారు. ఆయనతో పాటు బైకులో కూర్చుని వెళ్తున్న బంధువు ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. అజ్మల్ హత్యను ఖండిస్తూ పంజాబ్ ప్రావిన్స్‌లో జర్నలిస్టు నిరసన ప్రదర్శనలు నిర్వహించి, హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేసి, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఇష్టంలేకుండా ప్రేమ వివాహం చేసుకున్న యువతులను చంపడం పాకిస్తాన్లో సర్వసాధారణం. ఒక్కోసారి ప్రేమజంటలకు మద్దతు ఇచ్చిన వారిని కూడా టార్గెట్ చేస్తుంటారు. -
పాకిస్థాన్ నేత కాల్చివేత
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఓ పార్టీ ముఖ్య నేతను కాల్చి చంపేశారు. ఈ ఘటన ఎప్పుడూ ఉద్రిక్తత పరిస్థితులు ఉండే బాలోచిస్తాన్‌లోని గ్రెయిషాలో చోటు చేసుకుంది. జమైత్ ఉలేమా ఐ ఇస్లామి ఫజల్(జేయూఐఎఫ్) పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి హఫీజ్ అబ్దుల్ వహీద్ రక్షాని తన ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని ఓ సాయుధుడు వచ్చి ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో రక్షాని అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఉగ్రదాడిని తిప్పికొట్టిన బృందంలో మాజీ హాకీ స్టార్
చండీగఢ్: గురుదాస్ పూర్ ఎన్కౌంటర్లో మాజీ స్టార్ హాకీ ప్లేయర్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ జుగ్రాజ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టిన బృందంలో 32 ఏళ్ల జుగ్రాజ్ కూడా సభ్యుడు. హాకీ నుంచి రిటైరైన తర్వాత జుగ్ రాజ్ పంజాబ్ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అమృత్‌సర్‌లో డీఎస్పీగా పనిచేస్తున్నారు. ముష్కరుల దాడి ఘటన సమాచారం తెలిసిన వెంటనే ఉదయం 8:15 గంటలకు దినానగర్ చేరుకున్నారు. అక్కడ ఎస్ఎస్పీ బృందంతో కలిసి తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొని ముష్కరులను మట్టు పెట్టారు. 2003లో జలంధర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత హాకీ నుంచి జుగ్రాజ్ రిటైరయ్యారు. కొన్నిరోజులు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించి హాకీ మెలకువలను ఆటగాళ్లకు నేర్పించారు. ఆ తర్వాత పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.