కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలపై కాల్పులు | First picture of young woman shot dead in London | Sakshi
Sakshi News home page

కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలపై కాల్పులు

Published Mon, May 29 2017 4:53 PM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM

కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలపై కాల్పులు

కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలపై కాల్పులు

లండన్‌: ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండే ఆ యువతి సాయుధుల చేతిలో ప్రాణాలుకోల్పోయింది. అప్పటి వరకు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ చల్లటి రాత్రిని ఆస్వాదిస్తూ అనూహ్యంగా మృత్యువాత పడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వాయవ్య లండన్‌లోని బ్రెంట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మోహనా అబ్దౌ అనే యువతిని అక్కడ అంతా మోంటాన అని పిలుస్తారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మోంటాన తమ ఇంటి పక్కనే ఉన్న చిన్నపిల్లలు ఆడుకునే క్రీడాస్థలానికి కొందరు స్నేహితురాళ్లతో కలిసి చేరుకుంది.

వారితో కలిసి చిన్నచిన్న సరదా ఆటలు ఆడుతోంది. అదే సమయంలో బైక్‌పై ముసుగుతో వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మొత్తం సమూహంపైకి కాల్పులు జరపగా మిగితా వారంత తప్పించుకోగా దురదృష్టం కొద్ది ఒక్క మోంటానకు మాత్రం ఒకే ఒక్క బుల్లెట్‌  తగిలి తీవ్రంగా గాయపడి చనిపోయింది. అయితే, పోలీసులు మాత్రం ఆ కాలనీకి చెందినవారే ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అందుకే, ఈ దాడికి దిగినవారు స్వయంగా లొంగిపోవడమో.. లేక తెలిసిన వారు నిజం బయటకు చెప్పడమో చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement