నోట్ల‘క్యూ’ల్లో ముగ్గురి మృతి | Three killed in the Queue | Sakshi
Sakshi News home page

నోట్ల‘క్యూ’ల్లో ముగ్గురి మృతి

Published Sat, Nov 12 2016 2:18 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM

నోట్ల‘క్యూ’ల్లో ముగ్గురి మృతి - Sakshi

నోట్ల‘క్యూ’ల్లో ముగ్గురి మృతి

పాత నోట్లను మార్చుకునే విషయంపై ఆందోళనతో శుక్రవారం ముగ్గురు మృతిచెందారు. మహారాష్ట్రలో ఒకరు, కేరళలో ఇద్దరు చనిపోయారు.

- ఢిల్లీలో నోట్ల మార్పిడికి లైన్లో వచ్చిన రాహుల్
- 25 నగరాల్లో బంగారు వ్యాపారులకు ఎకై ్సజ్ నోటీసులు
 
 ముంబై/న్యూఢిల్లీ:
పాత నోట్లను మార్చుకునే విషయంపై ఆందోళనతో శుక్రవారం ముగ్గురు మృతిచెందారు. మహారాష్ట్రలో ఒకరు, కేరళలో ఇద్దరు చనిపోయారు. ముంబై శివార్లలోని ములుంద్‌లో క్యూలైన్లో గంటలపాటు నిలబడిన విశ్వనాథ్ వర్తక్ (73) కుప్పకూలిపోయాడు. ఆసత్రికి తరలించే లోపే విశ్వనాథ్ మృతిచెందినట్లు తెలిసింది. కేరళలోని తలసెరిలో ఉన్ని(48) ఎస్‌బీఐలో రూ.5లక్షల విలువైన పాత నోట్లు అకౌంట్లో జమ చేసుకునేందుకు వచ్చి రెండో అంతస్తునుంచి పడటంతో మృతిచెందారు. పీఎఫ్ అకౌంటు నుంచి తీసుకున్న లోన్ కట్టేందుకు వచ్చిన ఉన్ని మృతి అనుమానాస్పదంగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా డబ్బు మార్చుకునేందుకు లైన్లో నిలుచున్న ఓ 75 ఏళ్ల వృద్ధుడు కూడా క్యూలోనే కుప్పకూలి చనిపోయాడు. జనం రద్దీ వల్ల కొన్ని చోట్ల బ్యాంకు సర్వర్లు పనిచేయలేదు. దీంతో కాసేపాగి రావాలని బ్యాంకు అధికారులు కోరినా ప్రజలు క్యూల్లోనుంచి తగ్గలేదు. వికలాంగులు, వయోవృద్ధులు కూడా డబ్బులు మార్చుకునేందుకు క్యూలో నిలబడ్డారు.

 దొంగనోట్లతో డిపాజిట్‌కు యత్నించి..
 సందట్లో సడేమియా అన్నట్లు పాతనోట్ల మార్పిడిలో బిజీగా ఉన్న బ్యాంకును దొంగనోట్లతో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన  యువకుడిని భువనేశ్వర్ పోలీసులు అరెస్టు చేశారు. 2.5 లక్షల విలువైన పాత నోట్లను డిపాజిట్ సమయంలో బ్యాంకు సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సుమీత్ కుమార్ తుడు రూ2.5 లక్షల విలువైన పాత నోట్లు తీసుకుని వచ్చారు. లెక్కిస్తున్నప్పడు 47వేల దొంగనోట్లు ఉన్నట్లు గుర్తించాం’ అని బ్యాంకు అధికారులు వెల్లడించారు. యువకుడు బ్యాంకు అధికారి కుమారుడని తేలింది.

 సరిపోయేంత డబ్బు ఉంది.. ఆర్బీఐ
 బ్యాంకుల వద్ద ప్రజలకు సరిపోయేంత మొత్తం ఉందని.. డబ్బులు మార్చుకోవాలనే తొందరలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్బీఐ సూచించింది. ప్రజలు ఓపిగ్గా ఉండాలని కోరింది. అటు నోట్లు మార్చుకునేందుకు వస్తున్న ప్రజలకు పోస్టల్ శాఖ వివిధ ప్రభుత్వ పథకాలతో స్వాగతం పలుకుతోంది. తమ వద్ద డబ్బులు దాచుకుంటే కలిగే లాభాలను వివరిస్తోంది. పాత నోట్ల రద్దుతో బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగారుు. దీంతో బంగారం అమ్మకాల వివరాలివ్వాలంటూ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎకై ్సజ్ ఇంటలిజెన్‌‌స  అధికారులు 25 నగరాల్లోని 600 మంది బంగారు వ్యాపారులకు సమన్లు ఇచ్చారు. అటు, ఏటీఎంలు, బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు నింపే వాహనాలకు భద్రత కల్పించాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందుకోసం.. రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడేందుకు ముగ్గురు అధికారులను ప్రత్యేకంగా నియమించింది. మరోవైపు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ కూడా కేంద్రం తీసుకున్న నోట్ల మార్పిడి నిర్ణయాన్ని స్వాగతించింది.  

 రాహుల్ నోట్ల మార్పిడి.. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ ఎస్‌బీఐ బ్రాంచ్ వద్ద ఉదయం నుంచే జనాలు క్యూలు కట్టారు. సాయంత్రం సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా క్యూ లైన్లోనిలబడి.. అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచారు. ‘రూ.4వేలను మార్చుకునేందుకు వచ్చాను. మీకు (రిపోర్టర్లు), మీ మీడియా సంస్థల అధిపతులకు, ప్రధాన మంత్రికి ప్రజలు పడుతున్న కష్టాలు కనిపించవు’ అని రాహుల్ విమర్శించారు. సాయంత్రం 4.25కు లైన్లో నిలుచున్న రాహుల్ మొత్తం క్యూ అయ్యేంత వరకు ఉండి నోట్లు మార్చుకున్నారు.
 
 అలా నింపగానే.. ఇలా ఖాళీ
 
శుక్రవారం తెల్లవారగానే ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలు కనిపించారుు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఏటీఎంలు తీయగానే ప్రజలు నోట్ల కోసం ఎగబడటంతో.. షట్లర్లు తెరిచిన కాసేపటికే ఖాళీ అయ్యారుు. చాలామటుకు ఏటీఎంలలో ఇంకా కొత్త కరెన్సీతోపాటు పాత (వందరూపాయలు) నోట్లు పెట్టలేదు. ఏటీఎంలలో చిన్న నోట్ల (వంద రూపాయల) కోసం జనాలు తీవ్రంగా ప్రయత్నించారు. పలుచోట్ల ఏటీఎంలు పనిచేయకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరుుతే అన్ని ఏటీఎంలలో కొత్త నోట్లు పెట్టేందుకు కొంత సమయం పడుతుందని.. అప్పటిదాకా ప్రజలు సహకరించాలని బ్యాంకుల యాజమాన్యాలు కోరుతున్నారుు. ముంబైలోనూ ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంక్, దేనా బ్యాంకు ఏటీఎంలు శుక్రవారం కూడా మూసే ఉన్నారుు. చాలా ఏటీఎంలు పొద్దున 9లోపే ఖాళీ అరుుపోయారుు. బ్యాంకుల ముందు కూడా నోట్లు మార్చుకునేందుకు పెద్ద సంఖ్యలో సామాన్య జనం క్యూలు కట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement