
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ, గుజరాత్ జాయింట్ కమిషనర్ జేకే భట్‌ల కాల్ రికార్డులను బయట పెట్టాలని ప్రవీణ్ తొగాడియా డిమాండ్ చేశారు. కాల్ రికార్డులు వెలుగులోకి వస్తే మరిన్ని వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఆయన అన్నారు.
విశ్వహిందూ పరిషత్‌లోని కొన్ని వర్గాలు ఇదిలావుండగా.. తొగాడియా విషయాన్నిరెండుమూడు రకాలుగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాయి. ఇప్పటికే తొగాడియా ఇష్యూను కొందరు వీహెచ్‌పీ నాయకులు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లారు. మరికొందరు ఈ విషయంపై రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంఘ్ జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. వీహెచ్‌పీలో ఒక వర్గం మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉంది.
ఈ నెల 26ప అలహాబాద్‌లో జరగనున్న మార్గదర్శక్ మండల్, సంత్‌ల సమావేశంలో ప్రవీణ్ తొగాడియా విషయాన్ని చర్చించవద్దని మరో వర్గం తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పాల్గొంటున్న తొగాడియా కూడా.. ఈ విషయంపై మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment