
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రయాణమంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. రైలు ప్రమాదాలు ఒకెత్తయితే ఏటికేడు రైళ్లలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత రెండేళ్లలో ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) నమోదు చేసిన హత్య, అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ వంటి నేరాలను పరిశీలిస్తే వీటి సంఖ్య ఏకంగా 35 శాతం పెరగడం గమనార్హం.
2014లో నమోదైన నేరాలు 31,609 కాగా, 2016లో వీటి సంఖ్య 42,388గా నమోదైంది. రాష్ట్రాలవారీగా చూస్తే 8293 కేసులతో యూపీ ఈ జాబితాలో టాప్‌లో ఉండగా, 7358 కేసులతో మహారాష్ట్ర, 5082 కేసులతో మధ్యప్రదేశ్, ఢిల్లీ (4306), బిహార్ (2287)లు తర్వాతి స్ధానాలత్లో నిలిచాయి. వీటిలో 236 హత్య కేసులు, 125 హత్యాయత్నం కేసులు, 79 అత్యాచార కేసులు, 53 దోపిడీ కేసులు, 112 ఘర్షణ కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment