
న్యూయార్క్: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారులు ఇకపై తమ డిస్‌ప్లే నేమ్‌ను 50 అక్షరాల వరకు పెట్టుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పరిమితి 20 అక్షరాలే ఉండగా శనివారం నుంచి దానిని ట్వీటర్ 50కి పెంచింది. ఏదేనీ ట్వీట్‌లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ గతవారమే 140 నుంచి 280కి రెట్టింపు చేయడం తెలిసిందే. పొడవైన పేర్లు కలిగినవారు తమ పూర్తి పేరును ఇకపై డిస్‌ప్లే నేమ్‌గా పెట్టుకునేందుకు తాజా చర్య ఉపయోగకరంగా ఉండనుంది.