
‘ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు క్షమించండి’
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నిప్పులు చెరిగారు. ఆమెను ఆమె రక్షించుకునేందుకే తనపై అవినీతి ఆరోపణలు మోపుతోందని ధ్వజమెత్తారు.
బెంగళూరు: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నిప్పులు చెరిగారు. ఆమెను ఆమె రక్షించుకునేందుకే తనపై అవినీతి ఆరోపణలు మోపుతోందని ధ్వజమెత్తారు. శారదా, నారదా, రోజ్ వ్యాలీ కుంభకోణాల్లో మునిగిన ఆమె తనను రక్షించుకునేందుకే తనపై నిందలు వేస్తోందని, ఇదంతా రాజకీయ కుంచితత్వమని అన్నారు.
వివిధ చిట్‌ఫండ్ కంపెనీలతో చేతులు కలిపి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, త్రిపుర సాంఘిక సంక్షేమ మంత్రి బిజితా నాథ్ అక్రమాలకు పాల్పడ్డారని, అయినప్పటికీ దర్యాప్తు సంస్థలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్పందించిన మాణిక్, తానొక తెరిచిన పుస్తకాన్ని అని, పలకలాంటివాడినని, దయచేసి తనను మమతతో సమానంగా చూడవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు క్షమించండని చెప్పారు. దేశంలో ఎంతో మంది ప్రతిపక్ష నేతలు ఉన్నప్పటికీ సీబీఐ మాత్రం తృణమూల్ వెంటే ఎందుకు పడుతుందని మమత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తదితరుల పేర్లు ప్రస్తావించారు.