
తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసలు కురిపించారు.
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రశంసలు కురిపించారు. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన టీఆర్‌ఎస్ సభ్యులు గురువారం మన్మోహన్‌ను కలిశారు. జోగినిపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్‌లను రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు మన్మోహన్‌కు పరిచయం చేశారు. అదే విధంగా రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల గురించి మన్మోహన్‌కు టీఆర్‌ఎస్ సభ్యులు వివరించారు. దీంతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన కితాబిచ్చారు. మన్మోహన్ ప్రశంసలకు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.