జైపూర్ : రాజస్ధాన్‌లోని జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఏడు రోజుల కిందట ఓ వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ రిపోర్ట్ రాగా, ఆ కుటుంబంలోని 25 మందికి నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ‘వారి నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించగా గత రాత్రే రిపోర్టులు వచ్చాయని, వారందరికీ పాజిటివ్‌గా తేలిందని..వారందరినీ ఆస్పత్రికి తరలించామ’ని వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నరోత్తమ్ శర్మ వెల్లడించారు.
కరోనా బారిన పడిన ఒకే కుటుంబంలోని వీరంతా జైపూర్‌లోని సుభాష్ చౌక్ ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. రాజస్ధాన్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న నగరం జైపూర్ కావడం గమనార్హం. జైపూర్ తర్వాత ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొందిన కోట, జోథ్‌పూర్ నగరాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. రాజస్ధాన్‌లో ఇప్పటివరకూ 11,000కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 251 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment