
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇలా బ్యాన్ చేసిన వాటిలో ఫ్యాషన్ బ్రాండ్ షీన్ కూడా ఉంది. బిజినెస్-టు-కన్స్యూమర్ (బి 2 సి) ఫ్యాషన్ బ్రాండ్ అయిన షీన్ యాప్ 2008 లో ప్రారంభించబడింది. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన ఫ్యాషన్ గురించి ఈ యాప్ అనేక వస్తువులు అందుబాటులో ఉంచేది.
(టిక్‌టాక్‌తో పాటు 59 యాప్స్‌పై భారత్ నిషేధం)
అయితే చైనా-భారత్ సరిహద్దులో గల్వాన్‌లోయలో జరిగిన వివాదం కారణంగా భారత ప్రభుత్వం చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో 59 చైనా యాప్స్‌ను దేశంలో నిషేధించింది. అయితే చాలా మంది ట్విట్టర్ యూజర్లు వివిధ రకాల మీమ్స్ క్రియేట్ చేస్తూ షీన్ యాప్‌కు వీడ్కోలు పలికారు. ఆడవాళ్లు ఏడుస్తూ షీన్ యాప్‌కు గుడ్‌బాయ్ చెబుతున్న ఈ మీమ్స్ అందరిని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. (చైనాలో మన న్యూస్ సెన్సార్)
Instagram models and girls after shein banned- pic.twitter.com/3lpFfPLJI0
— Mannat (@mannat_deep) June 29, 2020