'ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే తీర్పు చెప్పడం అన్యాయం'
'ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే తీర్పు చెప్పడం అన్యాయం'
Published Mon, Jun 30 2014 8:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
లక్నో: నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరుపై ఇప్పుడే ఓ అవగాహనకు రావడం అన్యాయమని కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నెల రోజుల కాలంలో ప్రభుత్వం పనితీరుపై ఓ నిర్ణయానికి రావడం అసమంజసమని రాజనాథ్ తెలిపారు.
సమగ్ర దేశాభివృద్దికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి రాష్టర ప్రభుత్వాలు తోడ్పాటునందించాలని రాజనాథ్ సూచించారు. ఇప్పటికే అంతర్జాతీయంగా మోడీ ప్రభుత్వానికి ఓ గుర్తింపు వచ్చిందన్నారు.
మావోయిస్టులపై ఆచితూచీ వ్యవహరిస్తామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా రాజనాథ్ లక్నోలో మీడియాతో కాసేపు సంభాషించారు.
Advertisement