ఈరోజు సాయంత్రం జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశం రేపటికి వాయిదా పడింది.
న్యూఢిల్లీ : ఈరోజు సాయంత్రం జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశం రేపటికి వాయిదా పడింది. గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కాగా లోక్సభ తొలి సమావేశాల తేదీలను కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలతో పాటు పలు ఇతర అంశాలను కూడా భేటీలో చర్చకు రానున్నాయి. కొత్తగా కొలువు తీరిన మోడీ సర్కార్ నిన్న తొలిసారిగా సమావేశం అయిన విషయం తెలిసిందే.