
రాష్ట్రానికి పట్టణ సంస్కరణ ప్రోత్సాహకం
2016–17లో పట్టణ సంస్కరణలు చేపట్టిన 16 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రోత్సా హకాలు అందించింది.
ఏపీకి రూ.27.14 కోట్లు, తెలంగాణకు రూ.19.93 కోట్లు అందజేసింది. శుక్రవారం ఢిల్లీలో పట్టణ పరివర్తన జాతీయ సదస్సులో భాగంగా ఈ ప్రోత్సాహకాలు అందించారు. సిటీ లివెబులిటీ ఇండెక్స్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దేశంలోని 116 ప్రధాన నగరాల్లో జీవన నాణ్యతను ఈ ఇండెక్స్ ద్వారా వెల్లడిస్తారు.